తిట్టినోళ్లతోనే పొగిడించుకుంటున్న థమన్ పోయిన చోటే తిరిగి సంపాదించుకోవడం, తిట్టిన వాళ్ళ చేతే పొగిడించుకోవడం.. ఇవన్నీ ఎంత కిక్ నిస్తాయో ప్రస్తుతం ఎవరికైనా తెలుసా అంటే అది థమన్ కేనని ఘంటాపధంగా చెప్పవచ్చు. మొదట్లో థమన్ సంచలనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వరసగా హిట్ ఆల్బమ్స్ అందించడంతో టాప్ రేంజ్ కి చేరుకున్నాడు. అయితే థమన్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నా తన మీద విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చేవి. డప్పు మ్యూజిక్ ఎక్కువ కొడతాడని, రొటీన్ మ్యూజిక్ ఉంటుందని, కాపీ కొడతాడని కూడా నానారకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే థమన్ ఈ విషయంలో నిరుత్సాహానికి గురవ్వకుండా, పట్టుదలతో పనిచేసి ట్రోల్స్ నే పొగడ్తలుగా మార్చుకున్నాడు. తనను తాను కొత్తగా రీ ఇన్వెంట్ చేసుకున్నాడు. థమన్ రీసెంట్ గా చేసిన సినిమాలు తొలిప్రేమ, మహానుభావుడు, అరవింద సమేత వంటి సినిమాలతో క్లాస్ మ్యూజిక్ తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన పాట అయితే శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. ఆల్రెడీ ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను తిరగరాస్తోంది. from టాప్ స్టోరీస్ – Telugu Mov...