రణరంగం క్లోజింగ్ కలెక్షన్స్
యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రణరంగం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మిశ్రమ స్పందనతో మొదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పెద్దగా పుంజుకోక చతికిలపడింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కేవలం 10 కోట్లపైన కలెక్షన్స్ సాధించి డిజాస్టర్ అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలిచింది.
గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన రణరంగం దాదాపు 25 కోట్ల బడ్జెట్ పెట్టారు. అంతకుమించి ఈ చిత్రానికి బిజినెస్ జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10.23 కోట్ల షేర్ సాధించడంతో బయ్యర్లు భారీ నష్టాలను చవిచూశారు. శర్వానంద్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.
ఫుల్ రన్ కలెక్షన్స్ ఏరియా వైజ్ బ్రేకప్ ఈ విధంగా ఉంది :
నైజాం : 3.51 కోట్లు
సీడెడ్ : Rs 1.17 కోట్లు
ఉత్తరాంధ్ర : Rs 1.27 కోట్లు
ఈస్ట్ : Rs 81 లక్షలు
వెస్ట్ : Rs 66 లక్షలు
గుంటూరు : Rs 76 లక్షలు
కృష్ణ : Rs 68 లక్షలు
నెల్లూరు : Rs 47 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం : Rs. 9.30 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : Rs. 61 లక్షలు
ఓవర్సీస్ : Rs. 32 లక్షలు
మొత్తం : Rs. 10. 23 కోట్లు
ప్రస్తుతం శర్వానంద్ 96 రీమేక్ లో నటిస్తున్నాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mBbcYO
Comments
Post a Comment