ఇలాంటి పాత్రలతో ఏం ఒరుగుతుంది పూజ?
ఇటీవలే విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో పూజ హెగ్డే కేవలం 20 నిముషాలు మాత్రమే కనిపించే పాత్రలో తళుక్కున మెరిసింది. ఆమె ఉన్నది కాసేపే అయినా ఆమె వల్ల తెగిన టికెట్లు ఎక్కువ. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లేకపోయి ఉంటే గద్దలకొండ గణేష్ ఫలితం ఎలా ఉండేదో ఊహించుకోవడం కష్టం.
హరీష్ శంకర్ కు మాస్ పల్స్ బాగా తెలుసనడానికి ఉదాహరణ గద్దలకొండ గణేష్. ఈ సినిమా చూసిన క్రిటిక్స్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి మైనస్ అవుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అదే ఈ చిత్రానికి ప్లస్ గా మారింది. ముఖ్యంగా ఎల్లువొచ్చి గోదారమ్మ పాట రీమిక్స్ చేయడం అనేది సూపర్ గా వర్కౌట్ అయింది.
అందులోనూ పూజ హెగ్డే పాత్రకు వచ్చిన రెస్పాన్స్ సూపర్. 20 నిముషాలు కనిపించినా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించగలిగింది పూజ. అందుకే ఆమెకు ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. అయితే పూజ మాత్రం ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా హౌస్ ఫుల్ 4 లో నటించింది. ట్రైలర్ చూస్తేనే పూజ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదని ఇట్టే అర్ధమైపోతుంది. మరి డిమాండ్ బాగున్న టైమ్ లో ఇలాంటి పాత్రలు చేయడం వల్ల ఒరిగేదేంటో పూజకే తెలియాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mZ3MiL
Comments
Post a Comment