నాగ్ వల్ల ఆలోచనలో పడ్డ వెంకీ

నాగ్ వల్ల ఆలోచనలో పడ్డ వెంకీ
నాగ్ వల్ల ఆలోచనలో పడ్డ వెంకీ

బాలీవుడ్ లో ఇటీవలే సూపర్ హిట్ అయిన దే దే ప్యార్ దే చిత్ర రీమేక్ హక్కుల్ని కొన్నాడు టాప్ నిర్మాత సురేష్ బాబు. ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో తెలుగులో రీమేక్ చేయాలని సురేష్ బాబు భావిస్తున్నాడు. వెంకటేష్ కూడా ఈ రీమేక్ చేయాలని మొదట ఉత్సాహంగా కనిపించాడు కానీ ఇప్పుడు చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దానికి కారణం కింగ్ నాగార్జున.

అదెలాగంటే.. నాగార్జున ఇటీవలే చేసిన మన్మథుడు 2 ఎటువంటి ఫలితాన్ని అందుకుందో మనందరం చూసాం. మన్మథుడు 2, దే దే ప్యార్ దే దాదాపుగా ఒకటే థీమ్ తో తెరకెక్కింది. వయసు పడ్డ హీరోలు, తనకంటే చాలా తక్కువ వయసున్న హీరోయిన్లను ప్రేమించడం. వల్గర్ కామెడీ కూడా ఉంటుంది. ఇలాంటి చిత్రంలో నాగ్ ను తెలుగు ప్రేక్షకులు ఊహించలేకపోయారు.

మన్మథుడు ట్యాగ్ లైన్ ఉన్న నాగ్ చేస్తేనే ప్రేక్షకులు తిప్పి కొట్టారు, లేడీస్ ఫాలోయింగ్ అమితంగా ఉన్న వెంకటేష్ ఇటువంటి టైప్ సినిమాలు చేస్తే అసలు చూడగలరా అన్న డౌట్ వెంకటేష్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందువల్లనే ఇప్పుడు దే దే ప్యార్ దే రీమేక్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mkHwzE

Comments

Popular posts from this blog