మహేష్ కోసం బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. దీని వెనక నమ్రత ఉందని తెలుస్తోంది.
ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. బాలీవుడ్ వాళ్ళు మన సినిమాల పట్ల, మన హీరోల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు అక్కడ స్థిరమైన మార్కెట్ వచ్చేసింది. చిరు కూడా సైరాతో హిందీ వాళ్ళను పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటినుండో అక్కడ క్రేజ్ ఉండి, అక్కడనుండి ఆఫర్లు వస్తున్నా చేయనని చెబుతూ వస్తోన్న మహేష్ కు బాలీవుడ్ వైపు చూస్తున్నాడట.
మహేష్ కెరీర్ లో కీలకపాత్ర పోషిస్తోన్న నమ్రత, ఇప్పుడు బాలీవుడ్ ప్రయాణాన్ని కూడా ఈజీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం మొదట సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలని ప్రపోజల్ తెచ్చిందట. ఇందుకోసం అనిల్ రావిపూడితో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా తీయమని చెప్పిందని అంటున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే నెక్స్ట్ మహేష్ సినిమా హిందీలో కూడా తీద్దామని ప్లాన్ చేస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nmGRhc
Comments
Post a Comment