ఏంటి సైరా బయోపిక్ కాదా?
సైరా నరసింహారెడ్డి సినిమాకి మొదటినుండి జరుగుతున్న ప్రచారం ఇది భారతదేశ మొదటి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా. అందుకే కదా ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అన్న టైటిల్ పెట్టింది. అయితే ఈరోజు దర్శకుడు సురేందర్ రెడ్డి, ఈ చిత్రం నరసింహారెడ్డి బయోపిక్ కాదని చెప్పి సంచలనం సృష్టించాడు.
గత కొన్ని రోజులుగా ఉయ్యాలవాడ వారసులకు సైరా మేకర్స్ మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా చర్చలు ఫలించాయి అని కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నా హైకోర్టులో మాత్రం కేసు నడుస్తోంది. సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చినా ఇక్కడ తిప్పలు తప్పేలా లేవు.
హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కేసు విచారణ వద్ద సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఉండగా, అసలు ఈ చిత్రం నరసింహారెడ్డి బయోపిక్ కాదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అక్కడున్న అందరూ అవాక్కయ్యే పరిస్థితి. సైరా అన్నీ సజావుగా సాగితే అక్టోబర్ 2న విడుదల కానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nGsapo
Comments
Post a Comment