Posts

Showing posts with the label Film Nagar

కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే..!

Image
కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే..! క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిపోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ రియాలిటీకి వ‌చ్చే స‌రికి దాని ప్ర‌భావం అలాగే వుంద‌ని జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు తెలియ‌జేస్తున్నాయి. ఇటీవ‌ల వ‌రుస‌గా సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతుండ‌టంతో సినీ స్టార్స్ అంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన త‌మ చిత్రాల షూటింగ్‌ల‌ని స్టార్ హీరోలు.. క్రేజీ హీరోలు ఇటీవ‌లే ప్రారంభించిన విష‌యం తెలిసిందే. మెగా హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా త‌న పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ని ఇటీవ‌లే మొద‌లుపెట్టారు. లాక్‌డౌన్ బిఫోర్ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే మొద‌లైంది. దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జరుగుతోంది హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ నుంచి ప్ర‌ధాన తారాగ‌ణం, టెక్నీషియ‌న్స్ కోవిడ్ నిబంధ‌న‌ల్ని పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఏ ఒక్క‌రికి కూడా ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో షూట్ నిర్వ‌హి...

న‌చ్చ‌క‌పోతే మూసుకోండి : క‌ంగ‌న‌

Image
న‌చ్చ‌క‌పోతే మూసుకోండి : క‌ంగ‌న‌ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ ఏ విష‌యాన్నీ సాఫీగా వ‌ద‌ల‌డం లేదు. ప్ర‌తీ అంశాన్నీసీరియ‌స్‌గానే తీసుకుంటున్నారు. చిన్న విష‌యాన్ని కూడా పెద్ద‌గా చూస్తూ చుర‌క‌లంటిస్తున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేపై ఏదో ఒక రోజు నీ అహంకారం అణుగుతుంది అంటూ సంచ‌ల‌నం సృష్టించిన కంగ‌న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతిపై కూడా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా త‌న ఫాలోవ‌ర్స్ పై కూడా ఘాటుగా స్పందించి షాకిచ్చింది. ఇండియ‌న్ ఫిల్మ్ సెల‌బ్రిటీల్లో సోష‌ల్ మీడియాలో కంగ‌న వున్నంత యాక్టీవ్‌గా ఏ సెల‌బ్రిటీ వుండ‌రు అన్న‌ది తెలిసిందే. అయితే ప్ర‌తీ ట్వీట్‌ని సంచ‌ల‌నంగా మార్చాల‌ని కంగ‌న చూస్తున్న తీరుకు ఆమె ఫాలోవ‌ర్స్‌, ఫ్యాన్స్‌లోనూ విసుగొచ్చేస్తోంది. దీంతో ఆ విష‌యాన్ని కంగ‌న‌కు చెప్పేశాడు ఓ ఫాలోవ‌ర్‌. ఇప్ప‌టికైనా సైలెంట్ అయితే బాగుంటుందేమో అని స‌ల‌హా ఇచ్చాడు. దీంతో కంగ‌న‌కు చిర్రెత్తుకొచ్చింది. `త‌న ట్విట్ట‌ర్ ఖాతాను రోజంతా చెక్ చేసే అభిమానుల‌కు బోరు కొట్టినా.. విసుగ‌నిపించినా.. నా ట్వీట్‌లు చూసి అల‌సిపోయినా మ్యూట్ చేసుకోవ‌చ్చ‌ని, అదీ కుద‌ర‌న...

ఓటీటీల్లో ల‌క్ష్మీ స‌రికొత్త రికార్డ్‌!

Image
ఓటీటీల్లో ల‌క్ష్మీ స‌రికొత్త రికార్డ్‌! లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు గ‌త ఎనిమిది నెల‌లుగా మూత‌ప‌డ‌టంతో ఓటీటీల‌కు డిమాండ్ ఏర్ప‌డింది. మొద‌ట్లో కొంత మిశ్ర‌మంగా స్పంద‌న వున్నా వినోదానికి ఓటీటీలు త‌ప్ప మ‌రేదీ లేక‌పోవ‌డంతో అంతా వీటినే అనుస‌రించ‌డం మొద‌లుపెట్టారు. దీంతో డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ ల‌కు మ‌రింత డిమాండ్ ఏర్ప‌డింది. ఎంత‌లా అంటే ఫ్లాప్ సినిమాకు కూడా రికార్డు స్థాయి వ్యూస్ వ‌చ్చేంత‌. ఇటివ‌ల ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో విడుద‌లై డివైడ్ టాక్‌ని ద‌క్కించుకున్న సినిమాల‌ని చూస్తే ఈ విష‌యం అర్థ‌మైంది. ఇటీవ‌ల అనుష్క న‌టించిన ` నిశ్శ‌బ్దం `, కీర్తిసురేష్ న‌టించిన `మిస్ ఇండియా` వంటి చిత్రాలు తొలి స్ట్రీమింగ్‌కే డివైడ్ టాక్‌ని ద‌క్కించుకున్నాయి. తాజాగా అక్ష‌య్‌కుమార్ న‌టించిన `ల‌క్ష్మి` చిత్రానికి ఇదే త‌ర‌హా ఆద‌ర‌ణ ల‌భించడం విశేషం. అంతే కాకుండా ఈ మూవీ ఓటీటీల్లో విడుద‌లైన చిత్రాల్లోనే స‌రికొత్త రికార్డుని నెల‌కొల్పింది. టాక్ వైజ్‌గా ఫ్లాప్ అనిపించుకున్నఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో ఓటీటీ వేదిక‌గా విడుద‌లైన తొలి బిగ్ ఫిల్మ్‌గా చెబుతున్నారు. అంతే కాకుండా డిజిట్ ఫ్లాట్ ఫామ్‌లో అత్య‌ధిక వ్యూస్‌ని సాధ...

సోనుసూద్ అంత‌ డిమాండ్ చేస్తున్నారా?

Image
సోనుసూద్ అంత‌ డిమాండ్ చేస్తున్నారా? సోనుసూద్ .. లాక్‌డౌన్ టైమ్ క‌రోనా త‌రువాత ఆ స్థాయిలో వినిపించిన పేరిది. దేశ వ్యాప్తంగా ఎక్క‌డ స‌మ‌స్య వుంటే అక్క‌డ నేనున్నాన‌ని ముందుకొచ్చి ఎంతో మందికి త‌న వంతు సేవ చేశారు సోనుసూద్. దీంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న పేరు మారుమ్రోగిపోయింది. వేలు.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ఆయ‌న‌కు అబ్య‌ర్ధ‌న‌లు మొద‌ల‌య్యాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఆయ‌న‌కు ఫ్యాన్స్ అయిపోయారు. వెండితెర‌పై విల‌నిజాన్ని పండించిన సోనుసుద్ రియ‌ల్ లైఫ్‌లో హీరో అయిపోయాడు. దీంతో ఆయ‌న‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. సోను క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని చాలా మంది తెలుగు నిర్మాత‌లు ఆయ‌న కోసం క్యూ క‌డుతున్నార‌ట‌. అయితే వారికి సోనుసుద్ గ‌ట్ఇ షాకి ఇచ్చిన‌ట్టు తెలిసింది. గ‌తంలో ఓ సినిమాకు 2 కోట్లు తీసుకునే సోనుసుద్ లాక్‌డౌన్ పుణ్య‌మా అని ఆ మొత్తాన్ని డ‌బుల్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. 3.5 కోట్ల నుంచి 4 కోట్లు ఇస్తేనే న‌టిస్తాన‌ని డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. సీనియ‌ర్ హీరోతో ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రూపొందిస్తున్న ఓ డైరెక్ట‌ర్ కీల‌క విల‌న్ పాత్ర కోసం సోనుసుద్‌ని సంప్ర‌దించాడ‌ట. ఓల్డ్ రెమ్యున‌రేష‌న్...

`శ్రీ‌కారం` కోసం పెంచ‌ల్ దాస్ మాస్ సాంగ్‌!

Image
`శ్రీ‌కారం` కోసం పెంచ‌ల్ దాస్ మాస్ సాంగ్‌! పెంచల్ దాస్ పాడిన `దారి చూడు దుమ్మూ చూడు మామ‌..` మాస్ పాట పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. మాస్‌లో ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. రాయలసీమ యాసలో పాటలు రాయడం, పాడటం పెంచల్ దాస్ ప్ర‌త్యేక‌త‌. విల‌క్ష‌ణ శైలిలో రాయ‌ల‌సీమ ప‌ల్లె పదాల‌కు వ‌న్నె తీసుకొస్తున్నారాయ‌న‌. తాజాగా ఆయ‌న పుంచి మరో మాస్ పాట వ‌చ్చేసింది. శర్వానంద్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ` శ్రీకారం `. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై లో రామ్ అచంట‌, గోప్‌చంద్ అచంట‌ నిర్మిస్తున్నారు. ఏడు నెల‌ల విరామం త‌రువాత ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే తిరుప‌తిలో మొద‌లైంది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కిషోర్ బి ఈ మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ కోసం పెంచ‌ల దాస్ సాహిత్యం అందించి పాడిన పాట `భ‌లేగుంది బాలా..`. ఈ సాంగ్ ప్రోమోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌కు మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం అందించారు. మాస్ బీట్‌గా ఈ పాట ఆక‌ట్టుకునేలా క‌నిపిస్తోంది. ఫుల్ సాంగ్ ని ఈ నెల 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ  మాస్ పాట‌లో...

కొన్ని కోల్పోతేనే కొన్ని ద‌క్కుతాయ‌ట‌!

Image
కొన్ని కోల్పోతేనే కొన్ని ద‌క్కుతాయ‌ట‌! ` నేల టిక్కెట్టు ` సుంద‌రి మాళ‌వికా శ‌ర్మ‌ ఫిలాస‌ఫీ చెబుతోంది. ఈస్ట్ ముంబైలోని అంథేరీలో పుట్టిన ప్ర‌స్తుతం లా పూర్తి చేసే ప‌నిలో వుంది. కాలేజ్ డేస్ నుండి మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన మాళ‌విక తెలుగులో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె న‌టించిన తొలి చిత్రం `నేల‌టిక్కెట్టు`. భారీ అంచ‌నాలు పెట్ఉకుని అందాల విందు చేసినా ఈ మూవీ మాళ‌విక‌కు ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఆ క్ష‌ణం నుంచి సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్‌ల‌ని త‌న దైన గ్లామ‌ర్ స్టిల్స్‌తో ఆక‌ట్టుకోవ‌డం మొద‌లుపెట్టింది. 21 ఏళ్ల ఈ ముంబై చిన్న‌ది చిట్టి పోట్టి డ్రెస్సుల్లో అందాల విందు చేస్తూ నెటిజ‌న్స్‌తో పాటు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో అటెన్ష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్‌`లో న‌టిస్తోంది. కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. గ‌త కొన్ని నెల‌లగా హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేసిన మాళ‌విక శ‌ర్మ తాజాగా ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చింది. దీనికి ఆస‌క్త...

ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌!

Image
ఏయిర్ పోర్ట్‌లో ర‌కుల్ హ‌ల్‌చ‌ల్‌! ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు ఇటీవ‌ల బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంలో టాలీవుడ్ నుంచి ప్ర‌ధ‌మంగా వినిపించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గాళ్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి కార‌ణంగా వివాదంలో చిక్కుకున్న ర‌కుల్ కు విచార‌ణ నిమిత్తం ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. విచార‌ణ‌కు హాజ‌రైన ర‌కుల్ ఆ త‌రువాత త‌న త‌ప్పేమీ లేద‌ని, త‌న‌కు డ్ర‌గ్స్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్ప‌డంతో ఆమెకు కొంత రిలీఫ్ ల‌భించింది. ఆ త‌రువాత నుంచి క్రిష్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న ర‌కుల్ సెట్లో సంద‌డి చేస్తోంది. `కండ పొలం` న‌వ‌ల ఆధారంగా ప‌క్కా గ్రామీణ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. సాయి ధ‌ర‌మ్‌తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. జాగ‌ర్ల‌మూడి సామిబాబా, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్న క్రిష్ ప‌క్కా ప్లానింగ్‌తో పూర్తి చేస్తున్నారు. ఇదిలా వుంటే గ‌త రెండు నెల‌ల పాటు టెన్ష‌న్ టెన్ష‌న్‌తో గ‌డిపిన ర‌కుల్ తాజాగా శంషాబాద్‌ ఏయిర్ పోర్ట్‌లో చాలా కూల్‌గా ర‌నిపించింద‌. లేత రంగు హాఫ్ ష‌ర్ట్‌.. జీన్స్ ధ‌రించి చాలా కూల్‌...

నివేదా పేతురాజ్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్యా రాజేష్‌‌!

Image
నివేదా పేతురాజ్ ప్లేస్‌లో ఐశ్వ‌ర్యా రాజేష్‌‌! ఐశ్వ‌ర్యా రాజేష్‌ కు తెలుగులో మెగా ఆఫ‌ర్ ల‌భించింది. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి, మిస్ మ్యాచ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు చేరువైంది ఐశ్వ‌ర్యారాజేష్‌‌. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాన్ని చ‌విచూసినా తాజాగా ఐశ్వ‌ర్యా రాజేష్‌కు తెలుగులో మ‌రో ఆవ‌కాశం ద‌క్కింది. ` ప్ర‌స్థానం ` వంటి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న దేవా క‌ట్టా కొంత విరామం త‌రువాత సాయి ధ‌ర‌మ్‌తేజ్‌తో ఓ భారీ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగినా ఇంత వ‌ర‌కు ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందులో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు జోడీగా నివేదా పేతురాజ్‌ని ఎంపిక చేశారు. ఓపెనింగ్ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఫెర్ఫార్మెన్స్‌కి స్కోప్ వున్న పాత్ర కావ‌డంతో ఆమె స్థానంలో ఐశ్వ‌ర్యారాజేష్‌ని ద‌ర్శ‌కుడు ఫైన‌ల్ చేసి నివేద పేతురాజ్‌ని త‌ప్పించిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో మొ...

బాల‌య్య కోసం మ‌ల‌యాళ బ్యూటీ?

Image
బాల‌య్య కోసం మ‌ల‌యాళ బ్యూటీ? నంద‌మూరి బాల‌కృష్ణ .. ఊర మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ల కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సింహా` లెజెండ్ వంటి హిట్ చిత్రాలొచ్చాయి. ఈ మూవీస్ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ చిత్రం రానున్న విష‌యం తెలిసిందే. మిర్యాల న‌వీంద‌ర్‌రెడ్డి అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెరీర్ లో తొలిసారి గుండుతో బాల‌య్య అఘోరాగా క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ లాక్‌డౌన్ బిఫోర్ పూర్త‌యింది. ఓ ఛేజింగ్ సీన్‌ని కూడా చిత్రీక‌రించారు. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూట్‌ని స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ప‌రిస్థితులు ఎలా వుంటాయో తెలియ‌డం లేదు. బాల‌య్య అర‌వై దాట‌డంతో రిస్క్ ఎందుక‌ని భావిస్తున్నార‌ట‌. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టిన త‌రువాత షూట్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా ఇంత వ‌ర‌కు ఏ హీరోయిన్‌ని ఫైన‌ల్ చేయ‌లేదు. తాజాగా మ‌ల‌యాళ బ్యూటీ ప్ర‌గ్యా మార్టీన్ పేరు వినిపిస్తోంది. బీబీ3 గా ఇప్ప‌టికే వైర‌స్ గా మారిన ఈ మూవీ కోసం ప్ర‌గ్యా మార...

వ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా!

Image
వ‌ర్మ హీరోయిన్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా! రామ్‌గోపాల్ వ‌ర్మ తో క‌లిసి లాక్‌డౌన్ టైమ్‌లో ర‌చ్చ చేసింది శ్రీ రాపాక‌. `నేక్ డ్ ` (న‌గ్నం) పేరుతో వ‌ర్మ చేసిన వెబ్ ఫిల్మ్‌తో సంచ‌ల‌నం సృష్టించింది. హ‌ద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్‌తో ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించింది. తొలి మూవీతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన శ్రీ రాపాక ఓ కాస్ట్యూమ్ డిజైన‌ర్ అన్న విష‌యం తెలిసిందే. `నగ్నం`తో పాపుల‌ర్ అయిన శ్రీ రాపాక మ‌రో వెబ్ ఫిల్మ్‌తో రాబోతోంది. ఆమె న‌టిస్తున్న వెబ్ థ్రిల్ల‌ర్ `ద ల‌స్ట్ ఏ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ`. ఎస్ కె. ఎన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. థ‌ర్డ్ ఐ మూవీస్ బ్యాన‌ర్‌పై అశోక్ షిండే ఈ వెబ్ సిరీస్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. మ‌ర్డ‌ర్, వివాహేత‌ర సంబంధాల నేప‌థ్యంలో ఈ వెబ్ డ్రామాని రూపొందించారు. ట్రైల‌ర్‌లో మోతాదుకు మించిన స‌న్నివేశాలున్నాయి. కొన్ని సీన్‌ల‌లో శ్రీ‌రాపాక మ‌ళ్లీ రెచ్చిపోయింది. యువ‌త‌ని టార్గెట్ చేస్తూ ఈ వెబ్ డ్రామాని మొత్తం ల‌స్ట్ సీన్‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. `నేక్ డ్‌`లో థై షో చేస్తూ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేసి సంచ‌ల‌నం సృష్టించిన శ్రీ రాపాక ఇందులో...

ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌

Image
ఇస్మార్ట్ బ్యూటీ సారీలో జిగేల్‌ నిధి అగ‌ర్వాల్‌ .. ప‌క్కా హైద‌రాబాద్‌. అగ‌ర్వాల్ ఫ్యామిలీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `మున్నా మైఖేల్` తో సినీరంగ ప్ర‌వేశం చేసింది. టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించినా ఈ అమ్మ‌డి చూపు టాలీవుడ్‌పై వుండ‌టంతో ఇక్క‌డ ట్రై చేయ‌డం మొద‌లుపెట్టింది. `స‌వ్య‌సాచి`తో తెలుగులో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ ఫ్లాప్ కావ‌డంతో కొంత నిరాశంకు గురైంది. ఆ త‌రువాత చేసిన `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో పూరిని న‌మ్మ‌కుంది. రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ చేసిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం నిధి తెలుగులో ఒకే ఒక్క చిత్రంలో న‌టిస్తోంది. మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు, గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తోంది. నిత్యం సోష‌ల్ మీడియాలో సెక్సీ పిక్స్‌తో ఆక‌ట్టుకుంఉన్న నిధి అగ‌ర్వాల్ తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. సారీలో హొయ‌లొలికిస్తూ వ‌య్యారాలు పోయింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇన్ స్టాని హీ...

గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల ఎవ‌రు?

Image
గుణ‌శేఖ‌ర్ శ‌కుంత‌ల ఎవ‌రు? టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలు స్పీడందుకున్నాయి. ఇప్పుడు సెట్‌పై ఐదారు చిత్రాలు వున్నాయి. ఈ కోవ‌లో ప్ర‌ధ‌మంగా వినిపిస్తున్న పేరు `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌`. గుణ‌శేఖ‌ర్ ఈ మైథ‌లాజిక‌ల్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రానా ప్ర‌ధాన పాత్ర‌లో ఈ మూవీని తెర‌పైకి తీసుకురావాల‌ని గ‌త నాలుగైదేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. క‌రోనా వైర‌స్ స్వైర విహారం చేస్తున్నా `హిర‌ణ్య‌క‌శిప‌` ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని ప్ర‌క‌టించిన గుణ‌శేఖ‌ర్ దీన్ని లార్జ్ స్కేల్‌లో నిర్మించాలి కాబ‌ట్టి మ‌రింత స‌మ‌యం కావాలని, ఈ మ‌ధ్య‌లో కొత్త చిత్రాన్ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అన్న‌ట్టుగాను శుక్ర‌వారం కొత్త సినిమా అప్‌డేట్‌ని అందించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించ‌బోతున్న `హిర‌ణ్య క‌శిప‌` చిత్రానికి ముందు `శాకుంత‌లం` పేరుతో ఓ ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నానని ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన టైటిల్‌తో పాటు టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చేశారు. వెండితెరపై ‘హిరణ్యకశ్యప’లో నర...

జ‌గ‌ప‌తిబాబు త‌మ్ముడికి బెదిరింపులు!

ఎన్నో చిత్రాల్లో హీరోగా న‌టించి `లెజెండ్‌` చిత్రంతో విల‌న్‌గా మారిన న‌‌టుడు జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా గ‌డిపేస్తున్న ఆయ‌న సోద‌రుడికి బెదిరింపు కాల్స్ రావ‌డం క‌ల‌క‌లంగా మారింది. జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు యుగేంద్ర కుమార్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ట‌. దీంతో యుగేంద్ర కుమార్ బంజారా హిల్స్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. ఫిల్మ్ న‌గ‌ర్‌లో నివ‌సించే యుగేంద్ర కుమార్‌కు గుట్ట‌ల బేగంపేట‌కు చెందిన శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్టు తెలిసింది. గుట్ట‌ల బేగంపేట‌లోని ఓ స్థ‌లం విష‌యంలో వివాదం త‌లెత్త‌డంతో యుగేంద్ర‌కుమార్‌కు శ్రీ‌నివాస్ నుంచి బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ట‌. దీంతో జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడు యుగేంద్ర కుమార్ పోలీసుల్ని ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. దీని వెన‌క బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాల‌నీకి చెందిన రాజిరెడ్డి హ‌స్తం వున్న‌ట్టు ల‌నుమానించి యుగేంద్ర‌కుమార్ పోలీసుల్ని ఆశ్ర‌యించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేపట్టారు. దీంతో ఈ వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. స్వ‌యానా న‌టుడు జ‌గ‌ప‌తిబాబు సోద‌రుడిని హ‌త్య చేస్తామంటూ బెదిరింపులు రావ‌డంతో...

ప్ర‌భాస్‌పై ఒత్త‌డి పెరుగుతోందా?

Image
ప్ర‌భాస్‌పై ఒత్త‌డి పెరుగుతోందా? ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ` రాధేశ్యామ్‌ `. పిరియాడిక్ ల‌వ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణ‌కుమార్ రూపొందిస్తున్నారు. యువీ క్రియేన్స్‌, టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇట‌లీలో ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని కోవిడ్‌కి ముందే చిత్ర బృందం పూర్తి చేసి ఇండియా తిరిగి వ‌చ్చింది. కాగా ఈ చిత్రం కోసం హైద‌రాబాద్‌లోనే భారీ సెట్‌లు నిర్మించాల‌ని చిత్ర బృందం భావించింది. అందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఖాలీ స్థ‌లాన్ని అద్దెకు తీసుకుంటే భారీ స్థాయిలో అద్దె చెల్లించాల్సి వ‌స్తుంద‌ని భావించిన టీమ్ సిటీ ఔట్ స్క‌ర్ట్ లోని తెల్లాపూర్ ప్రాంతానికి స‌మీపంలో దాదాపు 4 ఎక‌రాల భూమిని భారీ సెట్ల కోసం అద్దెకు తీసుకున్నారు. ఇప్ప‌డ‌దే టీమ్‌కి భారంగా మారిన‌ట్టు తెలుస్తోంది. అందులో సినిమా కోసం యురోపియ‌న్ టౌన్‌షిప్‌. పాత‌కాల‌పు రైల్వే స్టేష‌న్ తో పాటు ఇత‌ర ప్రాప‌ర్టీస్‌ని ఏర్పాటు చేశారు. గ‌త ఏడు నెల‌లుగా షూటింగ్ ఆగిపోవ‌డంతో సెట్‌లో చాలా వర‌కు భాగం పాడైపోయింది....

శృతిహాస‌న్ ఆ సినిమా చేయ‌డం లేదా?

Image
శృతిహాస‌న్ ఆ సినిమా చేయ‌డం లేదా? కొంత విరామం త‌రువాత శృతిహాస‌న్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించడం మొద‌లుపెట్టింది. మైఖేల్ కోర్స‌ల్‌తో  డేటింగ్ చేసిన శృతి కొంత కాలం సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చింది. అత‌నికి బ్రేక‌ప్ చెప్పిన త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం ప్రారంభించింది. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తూ నిర్మిస్తున్న `లాభం` చిత్రంలో న‌టిస్తున్న శృతి తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `క్రాక్‌` మూవీలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ బిఫోర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే శృతిహాస‌న్ ప‌వ‌ర్‌స్టార్ తో క‌లిసి `వ‌కీల్ సాబ్‌` చిత్రంలో మెర‌వ‌నుంద‌ని వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తాజాగా తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన శృతిహాస‌న్ త‌ను తెలుగులో చేస్తున్న ` క్రాక్‌ ` మూవీతో పాటు త‌మిళ చిత్రం `లాభం` గురించి వివ‌రాల్ని వెల్ల‌డించింది. ఆ త‌రువాత త‌ను చేయ‌బోతున్న చిత్రాల గురించి వెల్...

రియా చ‌క్ర‌వ‌ర్తిపై బ‌యోపిక్ రాబోతోందా?

Image
రియా చ‌క్ర‌వ‌ర్తిపై బ‌యోపిక్ రాబోతోందా? సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ వివాదం చుట్టూ డ్ర‌గ్స్ దందా కూడా వుంద‌ని తేల‌డంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి విచార‌ణ మొద‌లుపెట్టారు. రియాకి డ్ర‌గ్స్‌కి సంబంధం వుంద‌ని తేల‌డంతో ఆమెని అదుపులోకి తీసుకుని ఆ త‌రువాత అరెస్ట్ చేయ‌డంతో ఈ కేసు కొత్త మ‌లుపు తిరిగింది. దీంతో ఆమెపై జాతీయ మీడియాతో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా కూడా దృష్టి పెట్ట‌డం మొద‌లుపెట్టింది. వ‌రుస‌గా జాతీయ స్థాయి మీడ‌యాతో పాటు అంత‌ర్జాతీయ మీడియా కూడా రియాపై సంచ‌ల‌న క‌థ‌నాల‌ని ప్ర‌సారం చేయ‌డం మొద‌లుపెట్టింది. దీంతో రియా ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో పాపుల‌ర్ అయిప‌పోయింది. ఈ ప‌రిణామాల్ని నిశితంగా ప‌రిశీలిస్తున్న కొంత మంది బాలీవుడ్ నిర్మాత‌లు ఆమె బ‌యోపిక్‌ని తెర‌పైకి తీసుకురావాల‌నుకుంటున్నార‌ట‌. లేదంటే ఓ డాక్యుమెంట‌రీని అయితే రూపొందించి ప్ర‌స్తుతం వున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్నారట‌. ఇదిలా వుంటే ఓ ప్ర‌ముఖ బుక్ ప‌బ్లిష‌ర్ రియాపై ఓ బుక్‌ని తీసుకురావాల‌నుకుంటున్నారట‌. అదును చ...

విశాల్‌కు భారీ షాక్‌.. `చ‌క్ర` రిలీజ్‌కు బ్రేక్‌..!

Image
విశాల్‌కు భారీ షాక్‌.. `చ‌క్ర` రిలీజ్‌కు బ్రేక్‌..! ఈ మ‌ధ్య త‌మిళ హీరో విశాల్ ‌ని వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గ‌తంలో త‌న ఆఫీస్ మేనేజ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌ల కార‌ణంగా వార్త‌ల్లో నిలిచిన విశాల్ తాజాగా `యాక్ష‌న్` మూవీ నిర్మాత‌ల కార‌ణంగా మ‌రోసారి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ` చ‌క్ర‌ `. సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో `అభిమ‌న్యు` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని విశాల్ న‌టిస్తూ నిర్మిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌, రెజీనా క‌సాండ్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎం.ఎస్‌. ఆనంద‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ ప‌డింది. ఈ చిత్ర రిలీజ్‌‌ని నిలిపివేయాలంటూ మ‌ద్రాసు హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ చిత్ర విడుద‌ల‌ని ఆపేయాల‌ని కోరుతూ ట్రిడెంట్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కేసు వేయ‌డంతో మ‌ద్రాసు హైకోర్టు విశాల్‌కు భారీ షాకిచ్చింది.  వివ‌రాల్లోకి వెళితే .. విశాల్ హీరోగా ట్రిడెంట్ ఆర్ట్స్ `యాక్ష‌న్` చిత్రాన్ని నిర్మించింది. 44 కోట్లు బ‌డ్జెట్ అయింది. అయితే పెట్టిన పెట్టుబ‌డి కూడా తిరిగిరాలేదు. త‌మిళ‌నాడులో 7.7 కోట్...

డ్ర‌గ్స్ కేసులో నేను లేను – న‌మ్ర‌త‌

Image
డ్ర‌గ్స్ కేసులో నేను లేను – న‌మ్ర‌త‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి త‌రువాత డ్ర‌గ్స్ కేసు కీల‌కంగా మారింది. సుశాంత్ గ‌ర్ల్ ఫ్రెండ్  రియాకు డ్ర‌గ్స్ డీల‌ర్‌ల‌తో సంబంధం వుంద‌ని తేల‌డంతో ఆమెను అరెస్ట్ చేసిన ఎన్ సీబీ అధికారులు విచార‌ణ‌లో ప‌లు కీల‌క ఆధారాల్ని రాబ‌ట్టార‌ని, ఈ కేసులో చాలా మంది సెల‌బ్రిటీల‌కూ డ్ర‌గ్స్‌తో సంబంధాలున్న‌ట్టు తెలిసింద‌ని జాతీయ మీడియాలో సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. అందులో తాజాగా టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ వైష్ న‌మ్ర‌త పేరు కూడా వుంద‌ని క‌థ‌నాలు రావ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఆమె టాలెంట్ మేనేజ‌ర్ జ‌య సాహా ఎన్సీబీ విచార‌ణ‌లో న‌మ్ర‌త పేరుతో పాటు న‌టి దియా మీర్జా పేరుని కూడా బ‌య‌ట‌పెట్టిన‌ట్టు వార్త‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని, తాను డ్ర‌గ్స్ కేసులో లేన‌ని న‌టి న‌మ్ర‌త వెల్ల‌డించారు. అంత‌కు ముందు ఆమె టీమ్ కూడా స్పందించింది. ఈ క‌థ‌నం ఓ క‌ట్టుక‌థ అని, న‌మ్ర‌త‌కు ఈ వియానికి ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఆమెని అన‌వ‌స‌రంగా డ్ర‌గ్స్ వివాదంలోకి లాగుతున్నార‌ని, ఆమెపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్న...

ఇష్టమైన నటిగా ఉండాల‌ని లేద‌ట‌!

Image
ఇష్టమైన నటిగా ఉండాల‌ని లేద‌ట‌! తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపుని సొంతం చేసుకుంది. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ల‌క్ష‌ల్లో అభిమానుల్ని సొంతం చేసుకుంది. సోష‌ల్ మీడియాలో ఆమె ఫాలోవ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం కార్తీతో `సుల్తాన్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇక తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న‌ప ` పుష్ప‌ ` చిత్రంలో బ‌న్నీకి జోడీగా క‌నిపించ‌బోతోంది. ప‌క్కా గ్రామీణ యువ‌తిగా ఇందులో ర‌ష్మిక క‌నిపించ‌బోతోంది. ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న వేళ మాంచి జోష్‌తో వుండాల్సిన ర‌ష్మిక ఎమోష‌న‌ల్ కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది. తాను అభిమాన న‌టిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, తాను ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌లా వుండాల‌నుకుంటున్నాన‌ని ఎమోష‌న‌ల్ అయ్యింది. ప్ర‌తీదీ త‌న‌కు ఎందుకు వ‌స్తుందో తెలియ‌దు. ఏది వ‌చ్చినా చిరున‌వ్వుతో దాన్ని ఆహ్వానిస్తాను. ప్ర‌తీ ఒక్క‌రూ మంచిగా లేదా చెడుగా వుండండి అయితే ఆ విష‌యంలో నిజాయితీగా వుండండి అంటోంది. ఎవ‌రైనా...

ఇచ్చిన మాట కోసం మ‌ళ్లీ ఇస్తున్నాడు!

Image
surya donates 1.5 crores for cine unions ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు భూరి విరాళాలు అందించ‌డంలో హీరో సూర్య ఫ్యామిలీ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో నిలుస్తుంటుంది. కేర‌ళ వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ భారీ విరాళాలు అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్న సూర్య ఫ్యామిలీ తాజాగా మ‌రో సారి సినీ కార్మికుల కోసం త‌న ఔదార్యాన్ని చాటుకుంది. అయితే ఈ ద‌ఫా సూర్య త‌న వ్య‌క్తి గ‌తంగా సాయం అందించారు. క‌రోనా కార‌ణంగా ప‌ని కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సినీ కార్మికుల కోసం హీరో సూర్య 1. 5 కోట్లు స‌హాయం అందించారు. త‌ను న‌టిస్తున్న ` ఆకాశ‌మే నీ హ‌ద్దురా ` చిత్ర బిజినెస్ ద్వారా వ‌చ్చే మొత్తంలో‌5 కోట్లను క‌రోనా వ్యాప్తి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కేటాయిస్తాన‌ని హీరో సూర్య మాటిచ్చార‌ట. ఇచ్చిన మాట ప్ర‌కారం తొలి విడ‌త‌గా 1.5 కోట్ల మొత్తాన్ని అంద‌జేశారు. ఇందులో 80 ల‌క్ష‌ల చెక్కును అధ్య‌క్షుడు ఆర్‌.కె. సెల్వ‌మ‌ణి ద్వారా ఫెస్పీకి, 30 ల‌క్ష‌ల చెక్కును అధ్య‌క్షుడు క‌లైపులి పులి ఎస్‌. థాను ద్వారా త‌మిళ ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌కు, 20 ల‌క్ష‌ల చెక్కును న‌డిగ‌ర్ సంఘానికి సూర్య ఫాద‌ర్ శివ‌కుమార్ అంద‌జేశారు. ...