సైరా ప్రమోషనల్ టూర్ ఫిక్స్ అయిందోచ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డిపై ప్రేక్షకుల్లో బజ్ బాగానే ఉంది. అయితే ఇంత ప్రతిష్టాత్మక చిత్రానికి సైరా టీమ్ అనుసరిస్తున్న ప్రమోషనల్ స్ట్రాటజీపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అసలు ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తూ ఒక్క భాషలో కూడా సరైన విధంగా ప్రమోషన్స్ చేయట్లేదని వారు వర్రీ అవుతున్నారు.
సినిమాలో మూడు పాటలుంటే కేవలం ఒక్క పాట మాత్రమే విడుదల చేసారు. తెలుగులో కూడా రెండు రోజుల క్రితమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇంకా మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టలేదు. సాహో టైమ్ లో ప్రభాస్ ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడో లెక్కే లేదు. తెలుగులో, హిందీలో వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అది హిందీ కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.
అలాంటిది ఇప్పుడు సైరా ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేయకపోవడంపై మెగా ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అయితే వారందరూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేకుండా సైరా ప్రమోషనల్ టూర్ ఫిక్స్ అయింది. రేపటి నుండి చరణ్, చిరు, ఇంకా మిగతా సైరా ప్రముఖ క్యాస్ట్ మీడియాతో మాట్లాడనున్నారు. వరసగా ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళలలో ఈవెంట్స్ ప్లాన్ చేసారు. ఈ వారం అన్ని భాషల్లో ప్రమోషన్స్ వరసపెట్టి చేయనున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mWObQf
Comments
Post a Comment