అల్లు అర్జున్ రంగంలోకి దిగాల్సిందేనా?
మీడియాకు ఎప్పుడూ మెగా ఫ్యామిలీ సాఫ్ట్ టార్గెట్ గా మారుతోంది. ఎక్కువ మంది హీరోలు ఉండటం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హీరో ఫంక్షన్ కు రాలేదు, ఆ హీరో ట్విట్టర్ లో విష్ చేయలేదు అంటూ రోజుకొక వార్త మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య విబేధాలు వచ్చాయని, అల్లు అర్జున్ కావాలనే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఊర్లో ఉండి కూడా కావాలనే అల్లు అర్జున్ సైరా ప్రీ రిలీజ్ వేడుకకు దూరంగా ఉన్నాడని, కావాలనే సైరా ట్రైలర్ గురించి స్పందించలేదని వార్తలు గుప్పుమన్నాయి. మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ ను దూరంగా పెడుతోందని అన్నారు. కానీ అలాంటిదేమీ లేదని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కేవలం అల వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉన్న కారణంగానే సైరా వేడుకకు వెళ్లలేకపోయాడట. అయినా అదే వేడుకలో అల్లు అరవింద్ పాల్గొన్నాడు. చిరు గురించి, చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఒకవేళ బన్నీని మెగా ఫ్యామిలీ దూరం పెడితే అల్లు అరవింద్ ఎందుకు పాల్గొన్నాడు? ఏదేమైనా అల్లు అర్జున్ ఈ విషయంలో స్పందిస్తే కానీ ఈ మెగా రగడ తగ్గేలా లేదు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mwC2RU
Comments
Post a Comment