డ్రగ్స్ కేసులో నేను లేను – నమ్రత
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి తరువాత డ్రగ్స్ కేసు కీలకంగా మారింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాకు డ్రగ్స్ డీలర్‌లతో సంబంధం వుందని తేలడంతో ఆమెను అరెస్ట్ చేసిన ఎన్ సీబీ అధికారులు విచారణలో పలు కీలక ఆధారాల్ని రాబట్టారని, ఈ కేసులో చాలా మంది సెలబ్రిటీలకూ డ్రగ్స్‌తో సంబంధాలున్నట్టు తెలిసిందని జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రసారం అయ్యాయి. అందులో తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ వైష్ నమ్రత పేరు కూడా వుందని కథనాలు రావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఆమె టాలెంట్ మేనేజర్ జయ సాహా ఎన్సీబీ విచారణలో నమ్రత పేరుతో పాటు నటి దియా మీర్జా పేరుని కూడా బయటపెట్టినట్టు వార్తలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని, తాను డ్రగ్స్ కేసులో లేనని నటి నమ్రత వెల్లడించారు. అంతకు ముందు ఆమె టీమ్ కూడా స్పందించింది. ఈ కథనం ఓ కట్టుకథ అని, నమ్రతకు ఈ వియానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఆమెని అనవసరంగా డ్రగ్స్ వివాదంలోకి లాగుతున్నారని, ఆమెపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్టు వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఖండించారు. అయితే ఇటవల ఈ వివాదంలో ముందుగా రకుల్ ప్రీత్‌సింగ్, సోహా అలీఖాన్, శ్రద్దా కపూర్‌ల పేర్లు వినిపించాయి. రకుల్ మీడియా ప్రచారంపై నియంత్రణ విధించండి అంటూ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32VgMbg
Comments
Post a Comment