విశాల్‌కు భారీ షాక్.. `చక్ర` రిలీజ్‌కు బ్రేక్..!
![విశాల్‌కు భారీ షాక్.. `చక్ర` రిలీజ్‌కు బ్రేక్..! విశాల్‌కు భారీ షాక్.. `చక్ర` రిలీజ్‌కు బ్రేక్..!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/09/Vishal-new-movie-chakra-in-leagal-trouble.jpg)
ఈ మధ్య తమిళ హీరో విశాల్‌ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో తన ఆఫీస్ మేనేజర్ సంచలన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచిన విశాల్ తాజాగా `యాక్షన్` మూవీ నిర్మాతల కారణంగా మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `చక్ర`. సైబర్ క్రైమ్ నేపథ్యంలో `అభిమన్యు` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని విశాల్ నటిస్తూ నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎం.ఎస్. ఆనందన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఈ చిత్ర రిలీజ్‌ని నిలిపివేయాలంటూ మద్రాసు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ చిత్ర విడుదలని ఆపేయాలని కోరుతూ ట్రిడెంట్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ కేసు వేయడంతో మద్రాసు హైకోర్టు విశాల్‌కు భారీ షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే .. విశాల్ హీరోగా ట్రిడెంట్ ఆర్ట్స్ `యాక్షన్` చిత్రాన్ని నిర్మించింది. 44 కోట్లు బడ్జెట్ అయింది. అయితే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. తమిళనాడులో 7.7 కోట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాత దాదాపు 20 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఫిల్మ్‌ని ఇదే సంస్థకు చేస్తానని విశాల్ మాటిచ్చారట. ఇచ్చిన మాటని తప్పి `చక్ర` చిత్రాన్ని సొంత బ్యానర్‌లో చేశారు. ఈ మూవీ దిపావళికి ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. తమకు 8.29 కోట్లు చెల్లించకుండా విశాల్ `చక్ర`ని ఎలా రిలీజ్ చేస్తాడని ఆగ్రహించిన ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించింది. తమకు డబ్బులు చెల్లించే వరకు ఆ చిత్రాన్ని రిలీజ్ చేయరాదంటూ కోర్టుకు విన్నవించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం విశాల్ `చక్ర` రిలీజ్‌ని నిలిపివేస్తూ తీర్పిచ్చింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3kGaBxY
Comments
Post a Comment