ప్రభాస్‌పై ఒత్తడి పెరుగుతోందా?
![ప్రభాస్‌పై ఒత్తడి పెరుగుతోందా? ప్రభాస్‌పై ఒత్తడి పెరుగుతోందా?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/09/Radhe-Shyam-location-rents-pressure-on-Prabhas.jpg)
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. పిరియాడిక్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్నారు. యువీ క్రియేన్స్, టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటలీలో ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలని కోవిడ్‌కి ముందే చిత్ర బృందం పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చింది.
కాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లోనే భారీ సెట్‌లు నిర్మించాలని చిత్ర బృందం భావించింది. అందు కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఖాలీ స్థలాన్ని అద్దెకు తీసుకుంటే భారీ స్థాయిలో అద్దె చెల్లించాల్సి వస్తుందని భావించిన టీమ్ సిటీ ఔట్ స్కర్ట్ లోని తెల్లాపూర్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 4 ఎకరాల భూమిని భారీ సెట్ల కోసం అద్దెకు తీసుకున్నారు. ఇప్పడదే టీమ్‌కి భారంగా మారినట్టు తెలుస్తోంది.
అందులో సినిమా కోసం యురోపియన్ టౌన్‌షిప్. పాతకాలపు రైల్వే స్టేషన్ తో పాటు ఇతర ప్రాపర్టీస్‌ని ఏర్పాటు చేశారు.
గత ఏడు నెలలుగా షూటింగ్ ఆగిపోవడంతో సెట్‌లో చాలా వరకు భాగం పాడైపోయింది. దీంతో మళ్లీ షూటింగ్ చేయాలంటే సెట్‌ని రీక్రియేట్ చేయాలట. ఇది మేకర్స్‌కి పెను భారంగా మారినట్టు తెలుస్తోంది. సెట్‌ని ఖాలీ చేయాలన్నా నిర్మాతకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.
అయితే ప్రభాస్ మాత్రం పాత సెట్లలో కాకుండా రియల్ లొకేషన్ అయిన ఇటలీలోనే షూట్ చేద్దామని చెబుతున్నారట. దీంతో సెట్ల ఖర్చుతో పాటు అద్దె భారంగా మారినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే `రాధేశ్యామ్` టీమ్ ఇటలీ వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు తాజా న్యూస్. అయితే ఎరిగిన ఖర్చుల నేపథ్యంలో బడ్జెట్ పెరగడంతో ప్రభాస్ ప్రెషర్ ఫీలవుతున్నారట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Gji9aU
Comments
Post a Comment