రియా చక్రవర్తిపై బయోపిక్ రాబోతోందా?
![రియా చక్రవర్తిపై బయోపిక్ రాబోతోందా? రియా చక్రవర్తిపై బయోపిక్ రాబోతోందా?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/09/Producers-planning-for-biopic-on-Rhea-Chakraborthy-2.jpg)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం చుట్టూ డ్రగ్స్ దందా కూడా వుందని తేలడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. రియాకి డ్రగ్స్‌కి సంబంధం వుందని తేలడంతో ఆమెని అదుపులోకి తీసుకుని ఆ తరువాత అరెస్ట్ చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
దీంతో ఆమెపై జాతీయ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. వరుసగా జాతీయ స్థాయి మీడయాతో పాటు అంతర్జాతీయ మీడియా కూడా రియాపై సంచలన కథనాలని ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దీంతో రియా ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపపోయింది. ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న కొంత మంది బాలీవుడ్ నిర్మాతలు ఆమె బయోపిక్‌ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారట.
లేదంటే ఓ డాక్యుమెంటరీని అయితే రూపొందించి ప్రస్తుతం వున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట. ఇదిలా వుంటే ఓ ప్రముఖ బుక్ పబ్లిషర్ రియాపై ఓ బుక్‌ని తీసుకురావాలనుకుంటున్నారట. అదును చూసుకుని రియాతో ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని చేసుకోవాలన్న ఆలోచనలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే రియా ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటీషన్ పై మంగళవారం స్పందించాలని ముంబై హైకోర్టు సీబీఐని కోరినట్టు చెబుతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3kPyC5J
Comments
Post a Comment