ఇచ్చిన మాట కోసం మళ్లీ ఇస్తున్నాడు!
![ఇచ్చిన మాట కోసం మళ్లీ ఇస్తున్నాడు! surya donates 1.5 crores for cine unions](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/08/surya-donates-1.5-crores-for-cine-unions.jpg)
ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు భూరి విరాళాలు అందించడంలో హీరో సూర్య ఫ్యామిలీ ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంటుంది. కేరళ వరదల సమయంలోనూ భారీ విరాళాలు అందించి గొప్ప మనసు చాటుకున్న సూర్య ఫ్యామిలీ తాజాగా మరో సారి సినీ కార్మికుల కోసం తన ఔదార్యాన్ని చాటుకుంది. అయితే ఈ దఫా సూర్య తన వ్యక్తి గతంగా సాయం అందించారు. కరోనా కారణంగా పని కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సినీ కార్మికుల కోసం హీరో సూర్య 1. 5 కోట్లు సహాయం అందించారు.
తను నటిస్తున్న `ఆకాశమే నీ హద్దురా` చిత్ర బిజినెస్ ద్వారా వచ్చే మొత్తంలో5 కోట్లను కరోనా వ్యాప్తి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కేటాయిస్తానని హీరో సూర్య మాటిచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 1.5 కోట్ల మొత్తాన్ని అందజేశారు. ఇందులో 80 లక్షల చెక్కును అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణి ద్వారా ఫెస్పీకి, 30 లక్షల చెక్కును అధ్యక్షుడు కలైపులి పులి ఎస్. థాను ద్వారా తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు, 20 లక్షల చెక్కును నడిగర్ సంఘానికి సూర్య ఫాదర్ శివకుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంల దర్శకుడు భారతీరాజా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు. సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` చిత్రం అన్ని అవాంతరాలను దాటి అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3joUNif
Comments
Post a Comment