సినిమా, టీవి షూటింగ్‌లకు మార్గదర్శకాలివే! కరోనా మహమ్మారి కారణంగా సినిమా, టీవీ షూటింగ్‌లకు 60 రోజులకు మించి బ్రేక్ పడింది. ఈ నెల 31తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే సినిమా, టీవీ షూటింట్‌లకు అనుమతులు లభించనున్నాయి. అయితే భారీ సంఖ్యలో ఈ షూటింగ్‌లలో కార్మికులు పాల్గొనే అవకాశం మాత్రం కనిపించడం లేదు. గతంలో కంటే తక్కువ మందితో మాత్రమే షూటింగ్‌లు చేసుకోవాలని, సోషల్ డిస్టెన్స్‌ని, ప్రభుత్వ మార్గదర్శకాలని పాటించాలని ప్రభుత్వంతో పాటు సినీ పెద్దలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సినిమా, టీవీ షూటింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గదర్శకాలను పలువురు రిఫర్ చేస్తున్నారు. 1. హ్యాండ్ వాషింగ్, శానిటైజేషన్ ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి. ఇవి కాకుండా యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరూ మూడంచెల మెడికల్ మాస్క్, గ్లైవ్స్ షూటింగ్ స్పాట్‌లో ఉన్నంత సేపు విధిగా ధరించాలి. ఇక ఆర్టిస్టులు, ఇతర సిబ్బంది కూడా మాస్కులను తప్పనిసరిగా ధరించాలి. 2. ప్రతిరోజూ షూటింగ్ ప్రారంభించే ము...