జెర్సీ దర్శకుడు చరణ్ సినిమా గుట్టు విప్పేసాడు
![జెర్సీ దర్శకుడు చరణ్ సినిమా గుట్టు విప్పేసాడు జెర్సీ దర్శకుడు చరణ్ సినిమా గుట్టు విప్పేసాడు](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/05/Gowtham-impresses-Ram-Charan-with-his-capabilities-but-says-%E2%80%98No%E2%80%99.jpg)
మళ్ళీ రావా చిత్రంతో ఒక మంచి డెబ్యూ సాధించాడు గౌతమ్ తిన్ననూరి. లిమిటెడ్ బడ్జెట్ లో ఫీల్ గుడ్ మూవీ తీసి అందరినీ ఇంప్రెస్ చేయగలిగాడు. ఇక తన రెండో సినిమా జెర్సీతో అభిరుచి గల దర్శకుడు అనిపించుకున్నాడు. జెర్సీ సినిమాలో ఎమోషన్స్ ను ఎలివేట్ చేసిన తీరుకి గౌతమ్ కు బోలెడన్ని ప్రశంసలు లభించాయి. దాంతో పాటు బాలీవుడ్ నుండి కూడా పిలుపొచ్చింది. ఇప్పుడు అదే సినిమాను అదే పేరుతొ షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ఈ సినిమా షూటింగ్ మొదలై శరవేగంగా సాగుతుండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. హిందీ జెర్సీ విడుదలవ్వడానికి కనీసం మరో ఏడాది పడుతుంది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి గౌతమ్ తిన్ననూరి తెలుగులో చేయబోయే తర్వాతి చిత్రం మీద బోలెడన్ని పుకార్లు షికార్లు చేసాయి. గౌతమ్ తన తర్వాతి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీయనున్నాడని రూమర్స్ వచ్చాయి. చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టినరోజు సందర్భంగా పాత్రను పరిచయం చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
ఇక అసలు విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చరణ్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేసారు. అయితే అలాంటిదేం లేదని ఇప్పుడు తెలుస్తోంది. స్వయంగా గౌతమ్ ఈ విషయమై స్పందించాడు. అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చేసాడు. దీంతో చరణ్ తర్వాతి సినిమా విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. చూడాలి మరి చరణ్ ఎవరి పేరుని ఖరారు చేసుకుంటాడో.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XiGeos
Comments
Post a Comment