సినిమా, టీవి షూటింగ్‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలివే!

సినిమా, టీవి షూటింగ్‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలివే!
సినిమా, టీవి షూటింగ్‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలివే!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సినిమా, టీవీ షూటింగ్‌ల‌కు 60 రోజుల‌కు మించి బ్రేక్ ప‌డింది. ఈ నెల 31తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగియ‌నున్న నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే సినిమా, టీవీ షూటింట్‌ల‌కు అనుమ‌తులు ల‌భించ‌నున్నాయి. అయితే భారీ సంఖ్య‌లో ఈ షూటింగ్‌ల‌లో కార్మికులు పాల్గొనే అవ‌కాశం మాత్రం క‌నిపించ‌డం లేదు. గ‌తంలో కంటే త‌క్కువ మందితో మాత్ర‌మే షూటింగ్‌లు చేసుకోవాల‌ని, సోష‌ల్ డిస్టెన్స్‌ని, ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ని పాటించాల‌ని ప్ర‌భుత్వంతో పాటు సినీ పెద్ద‌లు చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా సినిమా, టీవీ షూటింగ్ స‌మ‌యాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌లువురు రిఫ‌ర్ చేస్తున్నారు.

1. హ్యాండ్ వాషింగ్‌, శానిటైజేష‌న్ ప్ర‌తీ ఒక్క‌రికీ త‌ప్ప‌నిస‌రి. ఇవి కాకుండా యూనిట్ స‌భ్యులు ప్ర‌తి ఒక్క‌రూ మూడంచెల మెడిక‌ల్ మాస్క్, గ్లైవ్స్ షూటింగ్ స్పాట్‌లో ఉన్నంత సేపు విధిగా ధ‌రించాలి. ఇక ఆర్టిస్టులు, ఇత‌ర సిబ్బంది కూడా మాస్కులను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి.

2. ప్ర‌తిరోజూ షూటింగ్ ప్రారంభించే ముందు స్టూడియో మొత్తాన్ని శానిటైజ్ చేయాలి. ప్ర‌భుత్వం గుర్తించిన సంస్థ ద్వారానే ఈ శానిటైజేష‌న్ జ‌ర‌గాలి.

3. ఆర్టిస్టులు ఇత‌ర యూనిట్ స‌భ్యులు త‌మ ఆరోగ్య ప‌రిస్థితి గురించి డిక్ల‌రేష‌న్ ఫామ్ ఇవ్వాలి. సినిమాలో బుక్ చేసే ముందు, షూటింగ్ అంతా పూర్త‌యిన త‌రువాత వెళ్లే ముందు ఈ వివ‌రాల‌ను ప్రొడ‌క్ష‌న్ టీమ్‌కు విధిగా ఇవ్వాలి.

4. సెట్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌తి ఒక్క‌రూ థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ త‌ప్ప‌ని స‌రిగా చేయించుకోవాలి. హై టెంప‌రేచ‌ర్ ఉన్న వ్య‌క్తుల్ని సెట్‌లోకి రానివ్వ‌కూడ‌దు. థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ అయన వ్య‌క్తి చేతికి బ్యాండ్ వేయాలి.

5. పాపుల‌ర్  ఆర్టిస్టులతో జూనియ‌ర్  ఆర్టిస్టులు పాల్గొనే స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణలో జాగ్ర‌త్త వ‌హించాలి. వారి మ‌ధ్య క‌నీసం రెండు మీట‌ర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.

6. మూడు నెల‌ల పాటు ఇద్ద‌రు జూనియ‌ర్  డాక్ట‌ర్లు, ఒక క్వాలిఫైడ్ న‌ర్స్ సెట్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉండేలా చూసుకోవాలి. వీళ్లు రెండు షిఫ్టుల్లో ప‌నిఏసేలా జాగ్ర‌త్త వ‌హించాలి. అలాగే సెట్ బ‌య‌ట అన్ని వేళ‌లా ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి.

7. క‌నీసం మూడు నెల‌ల వ‌ర‌కూ 60 ఏళ్లు దాటిన వాళ్లు షూటింగ్ స్పాట్‌లో లేకుండా చూసుకుంటే మంచిది.

8. కొంత కాలం వ‌ర‌కు జౌట్ డోర్ గురించి మ‌ర్చిపోయి, ఇన్ డోర్‌లో, సెట్స్‌లో షూటింగ్స్ చేస్తే మంచిది.

9. మేక‌ప్ సిబ్బంది, హెయిర్ డ్ర‌స్స‌ర్స్ పీపీఈ సెట్స్ ధ‌రించాలి. ప్ర‌తి ఒక్క‌రికీ మేక‌ప్ చేసే ముందు, చేసిన త‌రువాత శానిటైజ్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. మేక‌ప్ చేసే స‌మ‌యంలో మూడో వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కూడ‌దు.

10. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఖ్య బాగా త‌గ్గించుకోవాలి. అవ‌స‌ర‌మైన మేర‌కే సిబ్బంది ఉండాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3d8pWDZ

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly