మహేష్ సర్కారు వారి పాట డీటెయిల్స్ ఇవిగో

మహేష్ సర్కారు వారి పాట డీటెయిల్స్ ఇవిగో
మహేష్ సర్కారు వారి పాట డీటెయిల్స్ ఇవిగో

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత దాదాపు ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న సంగతి తెల్సిందే. సరిలేరు.. తో హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్న మహేష్ ఇప్పుడు మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టనున్నాడు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన తర్వాతి చిత్ర విశేషాలను అందరితో పంచుకున్నాడు. మరో హ్యాట్రిక్ కు బ్లాక్ బస్టర్ ఆరంభం అని ట్వీట్ చేసాడు మహేష్. దీంతో పాటు ఈ చిత్ర పోస్టర్ ను కూడా జత చేసాడు. మహేష్ బాబు తన తర్వాతి చిత్రాన్ని కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసాడు.

గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ కొట్టిన పరశురామ్ తో తన తర్వాతి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రానికి సర్కారు వారి పాట అనే ఆసక్తికర టైటిల్ ను అనౌన్స్ చేసారు. దీంతో పాటు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది. మహేష్ బాబు లుక్ మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. ముఖ్యంగా చెవికి రింగ్ పెట్టుకోవడం, మెడ మీద రూపాయి బిళ్ళ టాటూ ఇవన్నీ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం రెడ్ హాట్ ఫామ్ లో కొనసాగుతున్న థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. పీఎస్ వినోద్ కెమెరా మ్యాన్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36SvEaU

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly