మహేష్‌బాబు ఈ పాత్రలో నటిస్తే..
![మహేష్‌బాబు ఈ పాత్రలో నటిస్తే.. మహేష్‌బాబు ఈ పాత్రలో నటిస్తే..](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/05/Mahesh-Babu-as-Lord-Rama-with-Shiva-Dhanush.jpg)
పోస్టర్ చూసే కథ చెప్పేస్తున్న రోజులివి. ఓ కాంబినేషన్ సెట్ అయిందంటే ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా వుంటుంది?. ఇందులో తమ అభిమాన హీరో ఎలా కనిపించబోతున్నాడు? అనే దానిపై సినిమా టీమ్ కంటే ఎక్కువగా ఆసక్తికరమైన చర్చ అభిమానుల్లో సామాజ.ఇక మాధ్యమాల్లో జరుగుతోంది. తమ హీరో ఇలా కనిపిస్తాడా? ఈ డైరెక్టర్ కోరిక ఇది కాబట్టి తమ అభిమాన హీరోని ఈ గెటప్‌లో లేదా ఈ పాత్రలో చూపించబోతున్నాడా? అని ఈ మధ్య ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.
అలాంటి రచ్చే రాజమౌళి – మహేష్‌బాబు కాంబినేషన్‌లో రానున్న సినిమాపై జరుగుతోంది. ఇటీవలే రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తరువాత తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్నానని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా జానర్ ఏంటనేది రాజమౌళి స్పష్టం చేయకపోవడంతో మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా వుంటుందని మహేష్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు.
తాజాగా మహేష్‌ని రాముడి గెటప్‌లో చూపిస్తూ ఓ ఫొటోని వదిలారు. శివధనుస్సుని పట్టుకుని ఆరు పలకల దేహంతో కనిపిస్తున్న మహేష్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు లార్డ్ రామ అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఇవ్వడంతో రాజమౌళి నెక్ట్స్ సినిమా రామాయణం నేపథ్యంలో వుంటుందా? అని అంతా చర్చిస్తున్నారు. ఇదిలా వుంటే మహేష్‌తో రాజమౌళి క్కా కమర్షియల్ యాక్షన్ డ్రామాని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
This interesting #fanmade edit of #SuperstarMahesh is going viral today#MaheshBabu #SSRajamouli pic.twitter.com/BNhcgO2sXv
— Kaushik LM (@LMKMovieManiac) May 26, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3c6p94Y
Comments
Post a Comment