డిస్కో రాజా మూవీ రివ్యూ మూవీ రివ్యూ: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్, బాబీ సింహా, సునీల్, సత్య తదితరులు దర్శకత్వం: విఐ ఆనంద్ నిర్మాత: రజినీ తాళ్లూరి సంగీతం: ఎస్ ఎస్ థమన్ విడుదల తేదీ: జనవరి 24, 2020 రేటింగ్: 3.25 /5 గత మూడేళ్ళలో రవితేజ నుండి ఒక్క ప్రామిసింగ్ సినిమా కూడా రాలేదు. అయితే విడుదలకు ముందు నుండీ డిస్కో రాజా ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా ఒక విభిన్నమైన చిత్రమన్న ఫీలింగ్ అందరిలో కలిగింది. టాలెంటెడ్ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా. కథ: సైన్స్ ల్యాబ్ లో జరిగే ఒక ప్రయోగం వల్ల బ్రెయిన్ డెడ్ పెర్సన్ వాసు ( రవితేజ ) మాములు మనిషవుతాడు. అయితే తన గతం మొత్తం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఇంతకీ వాసు మీద జరిగిన ప్రయోగం వల్ల వాసు ...