సేమ్ టు సేమ్ రామ్ చరణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?

సేమ్ టు సేమ్ రామ్ చరణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?
సేమ్ టు సేమ్ రామ్ చరణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?

సరిగ్గా గుర్తు చేసుకుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ సినిమా చిరుతకు సంబంధించిన పోస్టర్లలో ఎక్కడా రామ్ చరణ్ లుక్ రివీల్ చేయలేదు. సినిమా రిలీజయ్యే వరకూ చరణ్ ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడు అన్నది ఎవరికీ తెలీదు. పోస్టర్లలో చరణ్ ఫేస్ కనిపించకుండా ఒక పార్టిక్యూలర్ థీమ్ ను ఫాలో అయ్యారు. సినిమాలో కూడా రామ్ చరణ్ ఎంట్రన్స్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేసారు. జైల్లో ముఖానికి కట్టుకున్న గుడ్డ లాగినప్పుడు గాల్లో చరణ్ ఎగురుతూ కెమెరా చరణ్ చుట్టూ తిరుగుతూ, వెనకాల నుండి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీస్తుంటే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ. మెగా ఫ్యాన్స్ కు పూనకాలు రావడానికి ఇంతకంటే సెటప్ అవసరం లేదేమో.

పూరి జగన్నాథ్ రామ్ చరణ్ ను సేఫ్ గా లాంచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. చరణ్ ను ముందు చూపించకుండా బిల్డప్ పెంచడం అనేది బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు ఉప్పెన టీమ్. రామ్ చరణ్ కు వెయిట్ చేసినంతగా మెగా ఫ్యాన్స్ ఇందులో డెబ్యూ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ గురించి వెయిట్ చేయకపోవచ్చు. అలాగే అప్పుడంటే మీడియా ఎక్స్పోజర్ జనాలకు కొంచెం తక్కువ. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ బయట ఎలా ఉంటాడన్నది అందరికీ బాగా తెలుసు.

ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేసారు. అయితే అందులో వైష్ణవ్ ను అటు తిప్పి నుంచో పెట్టి సముద్రపు అలలపై మెయిన్ ఫోకస్ పెట్టారు. కావాలనే వైష్ణవ్ ను చూపించట్లేదని, ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుకుంటున్నారు. అయితే నిజంగానే ఉప్పెన టీమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతోందా లేక రానున్న పోస్టర్లలో వైష్ణవ్ తేజ్ ను చూపిస్తారా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఉప్పెన ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RI7bhj

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly