పెళ్లికి రెడీ అయిపోతున్నయంగ్ హీరో!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ చాలా పెద్దదే వుంది. ప్రభాస్, రానా, నితిన్, శర్వానంద్, నిఖిల్, అఖిల్ అక్కినేని, సందీప్‌కిషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే వుంది. ఈ లిస్ట్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో నితిన్ పెళ్లికి రెడీ అయిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరో కూడా పెళ్లికి రెడీ అయిపోతున్నాడు.
`అర్జున్ సురవరవం` సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన నిఖిల్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని తెలిసింది. ఆ మధ్య నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు షికారు చేశాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అది జరగలేదు. దాంతో నిఖిల్ మళ్లీ సినిమాల బాట పట్టాడు. `అర్జున్ సురవరవం` ఫైనాన్స్ సమస్యల్లో ఇరుక్కోవడంతో కంగారుపడిన నిఖిల్ ఎట్టకేలకు ఆ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే తాజా సమాచారం ప్రకారం నిఖిల్ ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కావాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారట. ఇప్పటికే నిఖిల్ తల్లిదండ్రులు అతని కోసం వధువుని వెతికే సనిలో బిజీగా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ ప్రస్తుతం `కార్తికేయ` చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న `కార్తికేయ-2`లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతున్నట్టు తెలిసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OefPTT
Comments
Post a Comment