జయహో మాస్ మహారాజ్
జీవితంలో అత్యంత గొప్ప లక్షణం ఏంటి.? అని చాలా మంది పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు. నిజంగా జీవితంలో అత్యంత గొప్ప లక్షణం ఏమిటంటే సహనం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, మనం సహనంతో మనకు వచ్చిన పని మనకు వచ్చిన పని చేసుకుంటూ వెళుతూ ఉంటే, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం.! అనడానికి చాలా మంది వ్యక్తులు ప్రత్యక్ష నిదర్శనాలుగా మన ముందు కనిపిస్తారు. వారిలో ఒకరే టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ.
“నిన్నే పెళ్ళాడుతా” సినిమాలో “ఎటో వెళ్లిపోయింది మనసు..” పాట షూటింగ్ జరిగే సమయంలో నాగార్జున జుట్టు ఎగరడానికి ఫ్యాన్ పట్టుకున్న “భూపతిరాజు రవిశంకర్ రాజు” అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తర్వాత టాలీవుడ్ లో సంవత్సరానికి కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ, వందల కోట్ల టర్నోవర్ తోపాటు వందలాది సిబ్బందికి ఉపాధి కలిగించే ఒక పెద్ద హీరో గా ఎదిగిన వైనం ఎంతో స్ఫూర్తిదాయకం. నెలకు సుమారు వంద రూపాయల జీతంతో కెరీర్ మొదలుపెట్టి, తర్వాత ఇండస్ట్రీలో కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరో స్థాయికి రవితేజ ఎదగడం వెనకాల ఎన్నో ఏళ్ల కృషి,పట్టుదల, సహనం మరియు టాలెంట్ కూడా ఉన్నాయి.
విజయాలు వచ్చినా అపజయాలు వచ్చిన రవితేజ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు ఉండదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా మహా అయితే రెండు మూడు రోజులు ఆ మూడ్ లో ఉండి, వెనువెంటనే తర్వాత సినిమా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆయన. సింధూరం సినిమా నుండి మొదలు పెడితే “నీకోసం” “ఇడియట్”, “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం”, “అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి”, ఇలాంటి సినిమాలతో పాటు “నా ఆటోగ్రాఫ్”, “నేనింతే” లాంటి ప్రయోగాత్మకమైన సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఇక మాస్ హీరో అంటే నిజంగానే మాస్ లో నుంచి వచ్చిన హీరో అన్న పదానికి 100% న్యాయం చేసేలా ఉంటారు రవితేజ.
రీసెంట్ గా రిలీజ్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఆయన తాజా సినిమా “డిస్కో రాజా” సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, మరోపక్క గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “క్రాక్” సినిమా షూటింగ్ లో రవితేజ బిజీగా ఉన్నారు. మరోవైపు గత ఏడాది “రాక్షసుడు” సినిమాతో హిట్ సాధించిన రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాను కూడా రవితేజ ఓకే చేశారు.ఇక కొత్త డైరెక్టర్లను టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేయడంలో రవితేజ స్టైలే వేరు. ఒక్కసారి ఆయనకు ఎవరైనా క్రియేటివ్ గా కనెక్ట్ అయ్యారంటే కచ్చితంగా డేర్ స్టెప్ తీసుకొని వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు రవితేజ. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37v8FlM
Comments
Post a Comment