శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉగాది పురస్కారాల వేడుక చెన్నై లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా సినీ అవార్డుల కేటగిరిలో ఉత్తమ నటి గా కీర్తి సురేష్ ( మహానటి ) ఉత్తమ దర్శకుడు సుకుమార్ ( రంగస్థలం ), జ్యురి ప్రత్యేక అవార్డు రాశిఖన్నా (తొలిప్రేమ ), ఉత్తమ చిత్రం: మహానటి , ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ ( గీత గోవిందం ), ఉత్తమ నటి : సమంత ( రంగస్థలం ), ఉత్తమ నూతన నటి : రష్మిక మందన్న ( గీత గోవిందం), ఉత్తమ నూతన నిర్మాత : సాహు గారపాటి ( కృష్ణార్జున యుద్ధం), ఉత్తమ నూతన దర్శకుడు వెంకీ అట్లూరి ( తొలిప్రేమ ), ఉత్తమ హాస్యనటి : విద్యుల్లేఖ రామన్ ( తొలిప్రేమ ), ఉత్తమ నేపధ్య గాయని : చిన్మయి శ్రీపాద ( గీత గోవిందం )లు ఈ అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు బాపు బొమ్మ అవార్డును సీనియర్ నటీమణి సుహాసిని, బాపురమణ పురస్కారం సినీ ఆర్టిస్ట్ సురేష్ కడలి లకు అందజేశారు. ఈ అవార్డులతో పాటు మహిళా రత్న పురస్కారం అవార్డును వైద్య మరియు సేవ రంగంలో మంచి పేరు సంపాదించుకున్న శ్రీమతి కపిల దళవాయి, తెలుగు పరిశోధన అధికారి ఆవుల మంజులత లకు అందచేశారు. గత 20 సంవ...
Comments
Post a Comment