తల్లి అనుభవాలనే కథగా మలుస్తున్నాడు!
![తల్లి అనుభవాలనే కథగా మలుస్తున్నాడు! తల్లి అనుభవాలనే కథగా మలుస్తున్నాడు!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/08/Venkatesh-mahas-new-film-Sumathi-based-on-his-mother-life.jpg)
వాస్తవిక జీవితాల్లోని పాత్రల్ని అంతే సహజత్వంగా తెరపై ఆవిష్కరించి తొలి సినిమాతో ఔరా అనిపించాడు వెంకటేష్ మహా. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఆయన తెరకెక్కించిన చిత్రం `కేరాఫ్ కంచరపాలెం`. ఈ సినిమాతో విమర్శకులని సైతం మెప్పించిన వెంకటేష్ మహా ఇటీవల మళయాల చిత్రం `మహేషింటే ప్రతీకారం`ని తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య`గా రీమేక్ చేశారు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ తరువాత మరో ఆసక్తికరమైన పాయింట్‌తో వెంకటేష్ మహా ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. `సుమతి` పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు. ఓ పెద్ద వయస్కురాలు స్వదేశం నుంచి అగ్రరాజ్యానికి చెందిన ప్రధాన నగరానికి వస్తే ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? అన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తంగా తెలుస్తోంది.
వెంకటేష్ మహా ఈ కథని తన తల్లి అనుభహవాల నుంచి తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామీణ వాతావరణం నుంచి సిటీకి వచ్చిన తన తల్లి ఎదుర్కొన్న సమస్యలకు నాటకీయతని, కొంత కాల్పనికతని జోడించి ఈ చిత్ర కథని దర్శకుడు వెంకటేష్ మహా సినిమాగా తెరపైకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని `కేరాఫ్ కంచర పాలెం`, `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన పరుచూరి విజయ ప్రవీణతో కలిసి వెంకటేష్ మహా నిర్మించబోతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3gqoptP
Comments
Post a Comment