వర్మ పవర్‌స్టార్ స్టోరీ ఇంకా వుందా?
![వర్మ పవర్‌స్టార్ స్టోరీ ఇంకా వుందా? వర్మ పవర్‌స్టార్ స్టోరీ ఇంకా వుందా?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/07/Ram-gopal-varma-making-two-more-films-on-Pawankalyan.jpg)
స్టార్ హీరో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం `పవర్‌స్టార్`. `ఎన్నికల ఫలితాల తరువాత కథ` అంటూ వర్మ హంగామా చేసిన ఈ చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్, జనసైనికులు వర్మపై యుద్ధం ప్రకటించారు. వరుసగా వర్మని టార్గెట్ చేస్తూ సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా జూబ్లీ హిల్స్‌లో వున్న వర్మ ఆఫీసుపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే.
ఎన్ని అడ్డంకులు వచ్చినా, పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకించినా మొత్తానికి వర్మ `పవర్‌స్టార్`ని తను అనుకున్న విధంగానే ఈ సందర్భంగా రిలీజ్ చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ ప్రకటించాడు కూడా. ఈ చిత్రానికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చిందని, ఆన్ లైన్‌లో ఈ చిత్రాన్ని చూసిన వారి సంఖ్య చెబితే కొంత మందికి హార్ట్ ఎటాక్ వస్తుందని సెటైర్ వేశాడు. పవర్‌స్టార్ సిరీస్‌లో మరో రెండు సినిమాలు తీయబోతున్నానని వర్మ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది .
ఇంత జరిగిన వర్మలో మార్పు రాలేదని, ఎంత హెచ్చరించినా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నాడని పవన్ ఫ్యాన్స్ వర్మపై మండిపడుతున్నారు. వర్మ మాత్రం డిజిటల్ సినిమా రంగంలో తనకు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారని చెబుతున్నారు. రామ్‌గోపాల్ వర్మ ఓటీటీ కోసం మరో రెండు మూడు చిత్రాల్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BBTOey
Comments
Post a Comment