సూపర్‌స్టార్ కోసం రామ్‌చరణ్ విలన్?
![సూపర్‌స్టార్ కోసం రామ్‌చరణ్ విలన్? సూపర్‌స్టార్ కోసం రామ్‌చరణ్ విలన్?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/06/Aravinda-swamy-playing-key-role-for-mahesh-sarkaru-baari-paata.jpg)
సూపర్‌స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరపైకి రానున్న ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
మహేష్ లుక్ డిఫరెంట్‌గా వుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేల కోట్లు ఎగవేసిన ఓ బడా వ్యాపార వేత్త ని హీరో ముప్పుతిప్పలు పెట్టే కథగా ఈ సినిమా కొత్త తరహాలో వుండబోతోందని సమకాలీన రాజకీయాలపై కూడా సెటైర్లు వుంటాయని చెబుతున్నారు.
సినిమాలో విలన్ పాత్రకు ప్రాధాన్యత వున్న దృష్ట్యా పేరున్న నటుడిని ఈ పాత్ర కోసం చిత్ర బృందం అనుకుంటోందని, ఇప్పటికే కన్నడ హీరోలు సుదీప్, ఉపేంద్రలని సంప్రదించారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పాత్ర కోసం రామ్‌చరణ్ విలన్ తమిళ నటుడు అరవింద స్వామిని చిత్ర వర్గాలు సంప్రదిస్తున్నాయట. రామ్‌చరణ్ నటించిన `ధృవ` చిత్రంలో స్టైలిష్ విలన్‌గా అరవింద స్వామి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇంచు మించు అదే తరహా పాత్ర కావడంతో అరవిందస్వామి అయితేనే బాగుంటుందని దర్శకుడు పరశురామ్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Z0HJqZ
Comments
Post a Comment