నేను ఆ సినిమా చేయడం లేదు!
![నేను ఆ సినిమా చేయడం లేదు! నేను ఆ సినిమా చేయడం లేదు!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/06/Truth-is-that-Renu-Desai-is-not-part-of-Major.jpg)
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందంటూ ఇటీవల వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఆమె ఈ సారి కొత్త తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తోందని, మహేష్, ప్రభాస్‌లకు తల్లిగా కూడా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా రేణు దేశాయ్ `మేజర్` సినిమాలోని ఓకీలకమైన అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించిందని వరుస కథనాలు తెరపై కొచ్చాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రేణు దేశాయ్ వెల్లడించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం `మేజర్`. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలక అతిథి పాత్ర కోసం రేణు దేశాయ్‌ని చిత్ర బృందం సంప్రదించారని, ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చాలా పవర్‌ఫుల్‌గా వుంటుందని ప్రచారం జరిగింది.
అయితే ఈ వార్తలపై తాజాగా రేణు దేశాయ్ స్పందించింది. తాను ఏ సినిమా అంగీకరించలేదని స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితం కొంత మంది అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను మదర్ పాత్రలు చేయడానికైనా సిద్ధమేనని పాజిటివ్‌గా స్పందించానని, దాన్ని పట్టుకుని రకరకాలుగా ఊహించుకుంటూ వార్తలు పుట్టిస్తున్నారని వాపోయింది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా `మేజర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/387836W
Comments
Post a Comment