విశాల్ `చక్ర` కోసం సాహసోపేత నిర్ణయం!
![విశాల్ `చక్ర` కోసం సాహసోపేత నిర్ణయం! విశాల్ `చక్ర` కోసం సాహసోపేత నిర్ణయం!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/06/Vishal-Chakra-ready-to-direct-release-on-ott-platform.jpg)
విశాల్ నటిస్తున్న తాజా చిత్రం `చక్ర`. సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎం.ఎస్. ఆనందన్ రూపొందిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండగా కీలక పాత్రల్లో రెజీనా, సృష్టీ ధాంగే నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 27న ట్రైలర్‌ని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు హీరో విశాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి.
ఈ హడావిడీ అంతా చూస్తుంటే విశాల్ `చక్ర` కోసం సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడా? అంటే ఇండస్ట్రీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఎక్కడి షూటింగ్‌లు అక్కడే ఆగిపోయాయి. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు కరోనా భయంతో సెట్స్‌పైకి రావడానికి జంకుతున్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో తెలియక ఇబ్బందులు పడుతున్నాయి. కొంత మంది నిర్మాతలు మాత్రం థియేటర్లు రీ ఓపెన్ అయ్యేంత వరకు ఆగలేమని తమ చిత్రాల్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాయి.
ఇంత వరకు ఓటీటీలో బాలీవుడ్ మినహాయిస్తే దక్షిణాదిలో ఏ పెద్ద హీరో సినిమా ఓటీటీలో రిలీజ్ కాలేదు. తాజాగా విశాల్ అటు వైపుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. విశాల్ నటిస్తున్న `చక్ర` చిత్రాన్ని ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ భారీ ఆఫర్ ఇచ్చిందట. విశాల్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూడటం కంటే మంచి ఆఫర్ వస్తోంది కాబట్టి ఓటీటీకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నెల 27న ట్రైలర్ రిలీజ్‌తో పాటు మూవీ రిలీజ్‌కు సంబంధించిన అసలు విషయం బయటికి రానున్నట్టు తెలుస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3eANYIB
Comments
Post a Comment