పూరీ `జన గణ మన` ఆ స్టార్ హీరోతోనే?
![పూరీ `జన గణ మన` ఆ స్టార్ హీరోతోనే? పూరీ `జన గణ మన` ఆ స్టార్ హీరోతోనే?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/06/Puri-Jana-gana-mana-with-mahesh-babu.jpg)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `బిజినెస్‌మెన్` తరువాత ప్రకటించిన చిత్రం `జన గణ మన`. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పూరీ దీన్ని సూపర్‌స్టార్ మహేష్‌తో చేయాలనుకున్నారు. అప్పటికి లైన్ మాత్రమే అనుకున్న పూరి ఆ లైన్‌ని మహేష్‌కి వినిపించారట. ఆ తరువాత పూరీకి ఫ్లాపులు రావడంతో మహేష్ కి పూరీకి మధ్య గ్యాప్ పెరిగింది. `జన గణ మన` ఇక కష్టమనే మాటలు వినిపించాయి.
తాజాగా ఇదే ప్రాజెక్ట్‌ని తాను త్వరలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నానంటూ పూరీ ప్రకటించడంతో మళ్లీ ఈ చిత్రంపై చర్చ మొదలైంది. `జన గణ మన` నా డ్రీమ్ ప్రాజెక్ట్ అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నాను. ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తాను. ఇది పాన్ ఇండియా స్థాయి సబ్జెక్ట్. అని పూరీ ప్రకటించడంతో మళ్లీ ఈ సినిమా వార్తల్లో నిలిచింది. లాక్‌డౌన్ సమయంలోనే ఈ మూవీ స్క్రిప్ట్‌ని పూరీ పూర్తి చేశారట. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చిందని ఆయన టీమ్ చెబుతోంది.
ఈ చిత్రాన్ని ఖచ్చితంగా మహేష్‌తోనే పూరీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా దూరం వుంటున్న పూరీ, మహేష్ ఇటీవల దగ్గరయ్యారు. `సర్కారు వారి పాట` ఫస్ట్ లుక్‌పై పూరీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించడం, ఇన్ స్టా లైవ్‌లో అభిమానులు పూరీ తో సినిమా ఎప్పుడని అడిగితే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు తాను సిద్ధంగా వున్నానని మహేష్ సమాధానం చెప్పడం చూస్తుంటే `జన గణ మన` ఖచ్చితంగా మహేష్ కోసమే పూరీ చేశాడని, ఇద్దరి కలయికలో ఈ సినిమా రానుందని స్పష్టం అవుతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3fTMhpW
Comments
Post a Comment