పిల్లో చాటున మిల్క్ బ్యూటీ హంగామా!
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తారలు చేసే చిత్రాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్వీయ నిర్భంధంలో వుంటూనే వెరైటీ ఛాలెంజ్‌లతో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నారు. ఓ బాలీవుడ్ మోడల్ విసిరిన పిల్లో ఛాలెంజ్ ఇప్పుడు హీరోయిన్‌లలో వైరల్‌గా మారింది. ఇటీవల `ఆర్ ఎక్స్ 100` భామ పాయల్ రాజ్‌పుత్ ఎల్లో పిల్లో ధరించి ఫ్యాన్స్‌కి, నెటిజన్స్‌కి షాకిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా అలాంటి షాకే మిల్క్ బ్యూటీ తమన్నా ఇచ్చింది. పాల్ తరహాలోనే పిల్లో ఛాలెంజ్‌లో పాల్గొని తమన్నా పిచ్చెక్కిస్తోంది. మిల్కీ వైట్ స్కిన్ టోన్‌తో మిల మిలా మెరిసిపోయే తమన్నా వైట్ కలర్ పిల్లోని ధరించి ఫ్లోర్‌పై పడుకుని పోజులిచ్చింది. ఈ ఫొటోలని సోషల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేసింది. తమన్నా అందాలని కవర్ చేస్తున్న పిల్లోని చూసి కుర్రకారు జలసీ ఫీలవుతున్నారు.
మిల్కీ స్కిన్ ఐ లవ్ ఇట్ అని, ఓ మై గాడ్ పిల్లో డ్రెస్‌లో అమేజింగ్‌గా వున్నావని, క్రేజీ పిల్లో ఛాలెంజ్ అదిరిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తమన్నా ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తున్న `సీటీమార్` చిత్రంలో కబడ్డీ కోచ్‌గా నటిస్తోంది.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2y1zNMA
#feelingfancybutnowheretogo #weekendvibes #quarantinePillowchallenge #pillowchallenge
Comments
Post a Comment