నక్సలైట్ పాత్రలో క్రేజీ హీరోయిన్!
![నక్సలైట్ పాత్రలో క్రేజీ హీరోయిన్! నక్సలైట్ పాత్రలో క్రేజీ హీరోయిన్!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/04/Priyamani-Naxalite-in-Virata-parvam-movie.jpg)
ఉత్తర తెలంగాణలో జరిగిన యదర్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి. సురేష్‌బాబుతో కలిసి సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 90వ దశకం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సాయి పల్లవి జానపద కళాకారిణిగా, పల్లెల్లో చైతన్య గీతాలు ఆలపించే పల్లెటూరి యువతిగా కనిపించనుంది. నందితా దాస్ మానహక్కుల నేతగా నటిస్తున్నట్టు చెబుతున్నారు. ఇందులో నటి ప్రియమణి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర మాజీ నక్లైట్ గా కనిపిస్తుందని, అయితే కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు సాయి పల్లవిపై కీలక ఘట్టాల్ని పూర్తి చేశారు. రానా పై చిత్రీకరణ ప్రారంభించిన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి విజృంభించడంతో చిల్రీకరణ మళ్లీ ఆగిపోయింది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాతే ఈ సినిమా చిత్రీకరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంది. హీరో రానా కూడా నక్సలైట్ లీడఱ్గా ఉద్యమ నాయకుడిగా కనిపించనున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Y84cUc
Comments
Post a Comment