బాలీవుడ్ నసీరుద్దీన్‌షా ఆరోగ్యంపై వదంతులు!
![బాలీవుడ్ నసీరుద్దీన్‌షా ఆరోగ్యంపై వదంతులు! బాలీవుడ్ నసీరుద్దీన్‌షా ఆరోగ్యంపై వదంతులు!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/05/Actor-Naseeruddin-shah-hospitalised-a-fake-news.jpg)
బాలీవుడ్‌లో ఒక్క రోజు గ్యాప్‌తో ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ మృతి చెందడం బాలీవుడ్ వర్గాలని కలవరానికి గురిచేస్తోంది. కరోనా దేశ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వేళ బాలీవుడ్ దిగ్గజాలు మృతి చెందడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నటుడు నసీరుద్దీన్ షా ఆరోగ్యం క్షీణించిందని, ఆయనని ఆసుపత్రిలో చేర్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా నసీరుద్దీన్ షాకు మంచి పేరుంది గత కొన్ని దశాబ్దాలుగా ఆయన తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటున్నారు. తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రికి తరలించారంటూ గురువారం అర్థ్ర రాత్రి జాతీయ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు రావడం కలకలం రేపింది.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని, మా ఫాదర్‌కి ఏమీ కాలేదని, ఆయన బాగానే వున్నారని వివాన్ షా ట్వీట్ చేయడంతో బాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35lAjB8
Comments
Post a Comment