ఐసీయులో బాలీవుడ్ నటుడు.. ఏమైంది?
![ఐసీయులో బాలీవుడ్ నటుడు.. ఏమైంది? ఐసీయులో బాలీవుడ్ నటుడు.. ఏమైంది?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/04/Bollywood-Khan-in-ICU.jpg)
కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ బాలీవుడ్‌కు భారీ షాక్ తగిలింది. విలక్షణమైన నటనతో హాలీవుడ్ స్థాయికి చేరిన నటుడు ఇర్ఫాన్‌ఖాన్ గత కొంత కాలంగా ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మహేష్ నటించిన `సైనికుడు` చిత్రంలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కుటుంబం సభ్యులు ముంబైలోకి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఇర్ఫాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగానే వుందని తెలిసింది. కొలన్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆరోగ్యం ఇషమించిందని, ఐసీయులో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు వెల్లడించారు. 2018లో ఇర్ఫాన్‌ఖాన్‌కు న్యూరో ఎండో క్రైమ్ ట్యూమర్ వుందని బయటపడింది. దీని కోసం ఆయన లండన్ వెళ్లి అక్కడే చికిత్స పొందారు. మరోసారి చికిత్స కోసం లండన్ వెళ్లాల్సి వుంది.
కరోనా కారణంగా వరల్డ్ మొత్తం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లిపోవడంతో ఇర్ఫాన్ లండన్ వెళ్లలేక పోయారు. గత కొంత కాలంగా తన మనోధైర్యంతో ఇర్ఫాన్ న్యూరో ఎండో క్రైమ్ ట్యూమర్ ని ఎదుర్కొంటున్నారని, తాజా పరిస్థితి నుంచి కూడా ఆయన సులువుగానే బయటపడతారని ఇర్ఫాన్ వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. ఇటీవల జైపూర్‌లో వుంటున్న ఇర్ఫాన్ తల్లి మృతి చెందారు. లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఆమె అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ShpWsZ
Comments
Post a Comment