గూఢచారి పాప బికినీ రచ్చో రచ్చ!
శోభితా ధూళిపాళ. అచ్చ తెలుగమ్మాయి. ఏపీకి చెందిన తెనాలి ముద్దుగుమ్మ. అయినా తెలుగులో మాత్రం తొలి అవకాశాన్ని పొందలేకపోయింది. అనురాగ్ కశ్యప్ బాలీవుడ్‌లో రూపొందించిన సైకో థ్రిల్లర్ `రమన్‌రాఘవ్ 2.ఓ`తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలో రెచ్చిపోయి అంఆల విందు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
`రమన్‌రాఘవ్ 2.ఓ` సైకో థ్రిల్లర్.. రియలిస్టిక్ సినిమా కావడం… హాట్ సన్నివేశాలు ఎక్కువగా వుండటంతో తొలి సినిమాలోనే రెచ్చిపోయి హాట్ సీన్‌లలో నటించి ఎక్స్‌పోజింగ్‌కి రెడీ అనే సంకేతాలిచ్చింది. బాలీవుడ్‌లో పరిచయమైన రెండేళ్ల తరువాతే తెలుగు చిత్రం `గూఢచారి`లో మెరిసింది. హీరోయిన్‌గా నటించిన చనిపోయే పాత్ర కావడంతో ఇక్కడ పెద్దగా గుర్తింపుని పొందలేకపోయింది.
దాంతో అవకాశాలు కూడా రాలేదు. అయితే మరోసారి అడివి శేష్ `మేజర్` సినిమా కోసం హీరోయిన్‌గా మరో అవకాశం ఇచ్చాడు. ఇదిఆ వుంటే తమిళంలో ఊహించని అవకాశాన్ని దక్కించుకుంది శోభిత. ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రంతో అయినా శోభిత దశ మారుతుందేమో చూడాలి. ఇదిలా వుంటే లాక్‌డౌన్ వేళ శోభిత ఓ త్రోబ్యాక్ బికినీ పిక్‌ని షేర్ చేసింది. బీచ్‌తో టూ పీస్ బికినీ ధరించి అందాల విందు చేస్తున్న శోభిత ఫొటో సోషల్ మీడియా ఇన్ స్టాలో వైరల్‌గా మారింది.
Credit: Instagram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3cSuzBv
Comments
Post a Comment