దర్శకేంద్రుడి కల ఇప్పటికైనా నెరవేరేనా?
![దర్శకేంద్రుడి కల ఇప్పటికైనా నెరవేరేనా? దర్శకేంద్రుడి కల ఇప్పటికైనా నెరవేరేనా?](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/04/K.Raghavendra-rao-dream-come-true-this-time.jpg)
దర్శకేంద్రుడు కె. రావేంద్రరావు మల్టీస్టారర్ చిత్రం చేయాలనుకున్నారా?.. 17 ఏళ్ల క్రితం ఆయన కన్న కల కలగానే మిగిలిపోయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్పట్లో మల్టీస్టారర్ చిత్రాలు చాలా తక్కువ. అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల కలయికలో ఓ భారీ మల్టీ స్టారర్‌ని తెరపైకి తీసుకురావాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేశారట.
విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నారట. దీనికి `త్రివేణి సంగమం` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసుకున్నారట. అయితే ఆ సమయంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా వుండటం, ఫ్యాన్స్ మల్టీస్టారర్‌ని అంగీకరిస్తారో లేదో అనే భయం వుండటంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదట. అయితే ఆ స్థానంలో తన వందవ చిత్రంగా `గంగోత్రి` చిత్రాన్ని చేశారు. బన్నీని హీరోగా పరిచయం చేశారు.
అయితే ప్రస్తుతం ప్రేక్షకుల దృక్పథం మారింది. అభిరుచులూ మారాయి. టోటల్‌గా సినిమా స్వరూపమే మారింది. దీంతో రాఘవేంద్రుడికి తన డ్రీమ్ ప్రాజెక్ట్ `త్రివేణి సంగమం`పై మనసు మళ్లిందట. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని భావిస్తున్నారట. మరి రాఘవేంద్రరావు కల ఇప్పటికైనా ఫలిస్తుందో లేదో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xgoTSU
Comments
Post a Comment