రిలీజ్ కాకుండానే ఇరగదీసేస్తోంది!
![రిలీజ్ కాకుండానే ఇరగదీసేస్తోంది! రిలీజ్ కాకుండానే ఇరగదీసేస్తోంది!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/04/40M-views-for-Melody-Nee-Kannu-Neeli-Samudram-Uppena.jpg)
ఈ మధ్య యూట్యూబ్‌లో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని మూడు పాటలు 100 మిలియన్ వ్యూస్ దాటేసి రికార్డు సృష్టించాయి. ముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన `సామజ వరగమనా…` 100 మిలియన్ వ్యూస్ దాటడంతో అంతా అవాక్కయ్యారు. తెలుగు సినిమా పాట ఈ రేంజ్‌లో వ్యూస్‌ని రాబట్టిడం ఇదే తొలిసారి కావడంతో ప్రత్యేకంగా చెప్పుకున్నారు.
ఆ తరువాత ఇదే చిత్రానికి సంబంధించిన `రాములో రాములా…` కూడా అనూహ్యంగా 100 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. కాసర్లశ్యామ్ ఈ పాటని రాశారు. ఆ తరువాత రామజోగయ్యశాస్త్రి రాసిన `బుట్టబొమ్మ..` కూడా మిలియన్ వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డుని సాధించింది. ఇదే వరుసలో మరో పాట యూట్యూబ్‌లో ఇరగదీసేస్తోంది.
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని `నీ కన్ను నీలి సముద్రం..` అంటూ సాగే పాట 40 మిలియన్ వ్యూస్‌ని రాబట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందే ఈ పాటతో ఇరగదీసేస్తోందని అంతా అంటున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xPwoR4
Comments
Post a Comment