ఆరు వేల మందికి సాయం అందించారు!
![ఆరు వేల మందికి సాయం అందించారు! ఆరు వేల మందికి సాయం అందించారు!](https://www.tollywood.net/telugu/wp-content/uploads/2020/05/The-Deverakonda-foundation-helps-6000-families.jpg)
కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాపస్తంగా లాక్‌డౌన్ విధించడంతో సామాన్యులకు, ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలు నిత్యావసాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ `ది దేవరకొండ ఫౌండేషన్` ద్వారా 25 లక్షల మూల నిధితో నిజంగా అవసరం వున్న వారికి నిత్యావసరాలు అందించడం మొదలుపెట్టారు.
విజయ్ దేవరకొండ మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని చాలా మంది అభినందిస్తూ ప్రశంసలు కురిపిస్తుంటే కొంత మంది దాతలు విరాళాలు ప్రకటిస్తూ ప్రోత్సహిస్తున్నారు. విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫండ్ అంటూ కోటి రూపాయల్ని కేటాయించారు. నిత్యావసరాల్ని వాలెంటీర్ల సహాయంతో మధ్య తరగతి కుటుంబాలకు అందిస్తున్నారు.
ఇప్పటికి ది దేవరకొండ ఫౌండేషన్‌కు 77, 000 మంది తమ రిక్వెస్ట్ పంపించారు. అయితే అందులో 6000 వేల మందికి ఫౌండేషన్ నుంచి వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్ని అందించారు. త్వరలో మరి కొనప్ని కుటుంబాలకు కూడా ఇత్యావసర సరుకుల్ని అందించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయడం కోసం విరాళాల కోసం విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35naAsf
Comments
Post a Comment