అందుకే ప్రభాస్‌ని బాహుబలి అంటున్నారు!
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలే. ఏ దేశం గురించి విన్నా కరోనా మరణాల సఖ్యలు, పాజిటివ్ కేసులు.. చిన్న దేశం, పెద్ద దేశం, పేద దేశం, ధనిక దేశం అనే తేడా అఏకుండా కరోనా మహమ్మారి అన్ని దేశాల్ని అల్లల్లాడిస్తోంది. దీని ధాటికి దాదాపు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌ని ప్రకటించేసింది. మన దేశంలోనూ లాక్ డౌన్‌ని కేంద్రం ప్రకటించేసింది. దీంతో అయినా కరోనాని కట్టడి చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇదిలా వుంటే కరోనాపై యుద్ధం కోసం మేము సైతం అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు టాలీవుడ్ హీరోలు, నటీనటులు తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. తాజాగా దేశాన్ని కబలించడానికి పొంచి వున్న మహమ్మారి కరోనా నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మేము సైతం ఈ ముద్ధంలో భాగస్వాములం అవుతామంటూ సినీ స్టార్స్ కదంతొక్కారు. దండుగా కదిలారు.
కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా విరాళం అందించడానికి ముందుకొచ్చారు. మంగ్ హీరో నితిన్ ముందుగా ఈ సంప్రదాయానికి తెరలేపాడు. దాన్ని అనుసరిస్తూ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 2 కోట్లు, రామ్‌చరణ్ 70 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు, త్రివిక్రమ్ 20, దిల్ రాజు 20, కొరటాల 10, అనిల్ రావిపూడి 10, సాయితేజ్ 10, చిరంజీవి కార్మికుల కోసం కోటి, అల్లరి నరేష్ తన సినిమాకు పనిచేస్తున్న డైలీ వర్కర్‌లు 50 మందికి తలా 10 వేలు ప్రకటించారు. బాహుబలి ప్రభాస్ అందరికి మించి ఏకంగా 4 కోట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి 3 కోట్లు, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ప్రకటించి తనని ఇండస్ట్రీలో ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో, కీరవాణి తనని నిజమైన `బాహుబలి` అని ఎందుకు సంబోధించారో ఈ విషయంతో క్లారిటీ ఇచ్చారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QP1uOM
Comments
Post a Comment