సాహో తెలుగు రిలీజ్ ముందుకు
బాహుబలి తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన ప్రయత్నం సాహో. కేవలం ఒక్క సినిమా అనుభవమున్న సుజీత్ ను ఇంతటి భారీ సినిమాకు దర్శకుడిగా ఎంచుకున్నాడు ప్రభాస్. ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. హిందీలో బాగా ఆడిన ఈ చిత్రం తెలుగుతో పాటు మిగతా భాషల్లో ప్లాపైంది. ఇక ఈ చిత్రం డిజిటల్ గా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై స్ట్రీమ్ అవుతోంది. అక్కడ ఈ చిత్రానికి ఆదరణ బాగానే ఉంది. ఇదంతా అయిపోయి కొన్ని నెలలు గడిచాయి. మరి ఇప్పుడేంటి తెలుగు రిలీజ్ ముందుకు అంటున్నారు అనుకుంటున్నారా? డిజిటల్ గా రిలీజ్ అయినా ఇంకా సాహో సాటిలైట్ రిలీజ్ కాలేదు.
నిర్మాతలు స్ట్రాటజిక్ గా ఆలోచించి సినిమా రిలీజ్ కు ముందు సాటిలైట్ హక్కులు తమ వద్దే ఉంచుకున్నారు. ఐతే సినిమా ప్లాపవ్వడంతో హక్కులు కొనడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జీ నెట్వర్క్ హిందీ సాహో సాటిలైట్ రైట్స్ ను తీసుకుని ఈ మధ్యే టెలికాస్ట్ చేసింది. దానికి మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు హక్కులను కూడా కొనేసింది ఈ సంస్థ. త్వరలోనే తెలుగులో కూడా టెలికాస్ట్ చేయనుంది, మార్చ్ నెలాఖరులో లేదా ఏప్రిల్ మొదటి వారంలో టెలికాస్ట్ ఉండవచ్చు. తెలుగులో పెద్దగా ఆడని ఈ సినిమా సాటిలైట్ వెర్షన్ లో మాత్రం మంచి టీఆర్పీలు పొందే అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ రిలీజ్ లోనైనా సాహో ఆకట్టుకుంటుందేమో.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక ప్రేమకథను చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాతి చిత్రాన్ని కూడా ప్రభాస్ ఇటీవలే కన్ఫర్మ్ చేసేసాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా మరో ప్యాన్ ఇండియా సినిమాను వదలనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది చివరికి విడుదల కానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Tp9aHZ
Comments
Post a Comment