పవన్ కళ్యాణ్ చిత్ర ఫస్ట్ లుక్, సాంగ్ రిలీజ్ తేదీలు ఖరారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఫిల్మ్ గా చెప్పుకుంటున్న పింక్ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో కానిస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నివేత థామస్, అంజలి వంటి హీరోయిన్లు పాల్గొంటుండగా కొన్ని ఇంటెన్స్ కోర్ట్ రూమ్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ ల మధ్య వాదప్రతివాదనలు సినిమాను రక్తి కట్టిస్తాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య థమన్ ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ గురించి ట్వీట్ చేసి హల్చల్ చేసాడు. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేసారు కూడా. అయితే ఈ పాటకు సంబంధించిన ఏ విషయాన్నీ ఇంకా అధికారికంగా బయట పెట్టలేదు. కేవలం పనులు జరుగుతున్నాయని మాత్రం చెప్పాడు.
అయితే మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. మహిళా ప్రధానంగా సాగే సబ్జెక్ట్ కావడంతో ఆ రోజు అయితే మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు. ఇక అంతకంటే ముందే మార్చ్ 2న పవన్ కళ్యాణ్ లుక్ ను రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా లీకయ్యాయి. వీటిని అరికట్టాలంటే ఫస్ట్ లుక్ ను త్వరగా విడుదల చేయడం ఒకటే మార్గమని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. మరి టైటిల్ ను కూడా ఇప్పుడే విడుదల చేస్తారా లేక ముందు నుండీ అనుకుంటున్నట్లు ఉగాదికే దింపుతారా అన్నది తెలియాల్సి ఉంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3chX77Y
Comments
Post a Comment