హిట్ మూవీ ప్రివ్యూ

హిట్ మూవీ ప్రివ్యూ
హిట్ మూవీ ప్రివ్యూ

మూవీ ప్రివ్యూ: హిట్
నటీనటులు: విశ్వక్ సేన్, రుహాని శర్మ తదితరులు
నిర్మాత: నాని
దర్శకత్వం: శైలేష్ కొలను
సంగీతం: వివేక్ సాగర్
విడుదల తేదీ: ఫిబ్రవరి 28, 2020

ఫలక్ నూమా దాస్ సినిమాతో అందరికీ పరిచయమైన విశ్వక్ సేన్ హీరోగా నిర్మాతగా నాని రెండో ప్రయత్నంగా తెరకెక్కిన సినిమా హిట్ – ది ఫస్ట్ కేస్. ఈ సినిమా మొదటి నుండి ఆసక్తి రేకెత్తించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రంలో ప్రీతి అనే అమ్మాయి తప్పిపోవడం, దాన్ని హీరో ఎలా ఛేజ్ చేసాడు అనేది ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూ యూనిట్ సభ్యులు చాలా కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూమెంట్స్ ఈ చిత్రంలో చాలా ఉంటాయని తెలుస్తోంది.

అ! సినిమా తర్వాత నాని నిర్మించిన చిత్రం కావడం, థియేట్రికల్ ట్రైలర్, స్నీక్ పీక్ రెండూ కూడా ఆసక్తికరంగా మారడంతో ప్రేక్షకులలో ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి. హిట్ సినిమాకు ది ఫస్ట్ కేస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. దీన్ని బట్టి ఈ సినిమాను ఒక ఫ్రాంచైజ్ లాగ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

చి ల సౌ ఫేమ్ రుహాని శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మన దగ్గర ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లెర్స్ అరుదుగా వస్తుంటాయి. అయితే హాలీవుడ్ సినిమాల వల్ల ఈ జోనర్ ఏమీ మనకు కొత్తది కాదు. ఈ నేపథ్యంలో హిట్ మూవీ ఈరోజు విడుదలవుతుండగా ఫలితం ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ జోనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేది కాదు, పైగా భీష్మ చిత్రం దీనికి పోటీగా ఉంది. ఆఫ్ సీజన్ లో కూడా రిలీజవుతోంది. ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా కానీ హిట్ సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచుకోగలిగితే హిట్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. 6 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం నాని అండ్ కో కు ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి. టాలీవుడ్.నెట్ ఈ సినిమా రివ్యూతో మీ ముందుంటుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2I1eGvf

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly