అల టీమ్ ఈసారి శ్రీకాకుళం యాసను పట్టేస్తారట

అల టీమ్ ఈసారి శ్రీకాకుళం యాసను పట్టేస్తారట
అల టీమ్ ఈసారి శ్రీకాకుళం యాసను పట్టేస్తారట

తెలుగు భాషలో ఎన్నో యాసలు, మరెన్నో మాండలికాలు. ప్రాంతాలు మారే కొద్దీ యాసలు మారిపోతూ ఉంటాయి. మన దర్శకులు సైతం ఈ యాసలపై దృష్టి పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. యాసను సరిగ్గా పట్టుకుంటే ఆ ప్రాంతం వారిని ఇంప్రెస్ చేయొచ్చు. అలానే సినిమాకు ఒక ప్రత్యేకతను కూడా తీసుకురావొచ్చు. ఈ నేపథ్యంలో మనకు ఈ మధ్య కాలంలో యాస ప్రాధాన్యత పాటలు, సినిమాలు ఎక్కువయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న అల వైకుంఠపురములో కూడా యాస ప్రాధాన్యత బాగానే ఉంటుందిట. రాములో రాముల సాంగ్ లో నైజాం యాసను వాడుకున్నారు. అలాగే ఇప్పుడు విడుదల కాబోతోన్న మరో పాటలో శ్రీకాకుళం యాసను హైలైట్ చేసారని తెలుస్తోంది.

శ్రీకాకుళం యాసతో సాగే జానపద గీతం త్వరలో విడుదల కానుందట. శ్రీకాకుళానికే చెందిన జానపద కళాకారునితో ఈ పాటను పాడించారని తెలుస్తోంది. థమన్ మాస్ బీట్ కు ఆ యాసలో సాంగ్ వింటుంటే ఒక కొత్త ఊపు రావడం ఖాయం అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు ఈ పాట వస్తుందిట. సందర్భం పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అల వైకుంఠపురములో టీమ్.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు వేటికవే సూపర్ హిట్స్ గా నిలిచాయి. సామజవరగమన, రాములో రాముల పాటలైతే అదిరిపోయాయి. మ్యూజిక్ లవర్స్ గత కొన్ని నెలలుగా ఈ పాటల్లో మునిగితేలుతున్నారు. ఈ రెండు పాటలు చెరో 100 మిలియన్ వ్యూస్ ను సాధించడం విశేషమే. అలాగే ఓ మై గాడ్ డాడీ, బుట్ట బొమ్మ పాటలు కూడా శ్రోతలను అలరిస్తున్నాయి. ఇలా ఒకే ఆల్బమ్ నుండి వచ్చిన నాలుగు పాటలు సూపర్ హిట్ కావడం నిజంగా అరుదైన విషయమే. థమన్ కే ఈ విషయంలో మేజర్ క్రెడిట్ దక్కుతుంది.

అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సుశాంత్, నివేద పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EXxGZV

Comments

Popular posts from this blog