కీరవాణి కొడుకులు కుమ్మేసినట్టేగా!
గత కొంత కాలంగా ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఇద్దరు వారసుల అరంగేట్రం గురించి ఆసక్తిగా ఎదురుచూసింది. డిసెంబర్ 25న ఈ ఇద్దరు వారసులు ఒకే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారే లెజండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి వారసులైన శ్రీ సింహ, కాల భైరవ. ఇందులో శ్రీ సింహ హీరోగా పరిచయమైతే, కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఇద్దరూ ఒకే సినిమా ద్వారా పరిచయమవ్వడం విశేషం. ఆ సినిమానే మత్తు వదలరా. నిన్న క్రిస్మస్ రోజున ఈ సినిమా విడుదలైంది.
మొదటిరోజు నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడం విశేషం. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా పరిచయమైన ఈ ఇద్దరికీ మంచి పేరే వచ్చింది. శ్రీ సింహా హీరోగా పరిచయమైనా ఎక్కడా ఒక స్టార్ వారసుడు చేసే హంగామా చేయలేదు. చాలా సాధారణ పాత్ర చేసాడు. లిమిటెడ్ బడ్జెట్ లో చేసిన ఈ చిత్రంలో సింహా కొరియర్ బాయ్ వంటి చాలా సాధారణ పాత్రను, అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రను చేసాడు. తొలి సినిమానే అయినా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలకు తాను సరిగ్గా సరిపోతానని చెప్పకనే చెప్పాడు.
ఇక కాల భైరవ విషయానికి వస్తే తొలి సినిమానే అయినా సంగీత దర్శకుడిగా అవుట్ స్టాండింగ్ ఔట్పుట్ ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ విషయంలో కాల భైరవ ప్రతిభ గురించి మాట్లాడుకోవాలి. సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా గుడ్ల గూబ సౌండ్ తో వచ్చే రీ రికార్డింగ్ ను కీ సీన్స్ లో చాలా ఎఫెక్టివ్ గా వాడాడు. ఒక ప్రముఖ సంగీత దర్శకుడి కొడుకే అయినా ఎక్కడా ఆ ప్రభావం తన వర్క్ మీద పడకుండా, సరికొత్త సౌండ్స్ ను వాడాడు.
ఏదేమైనా కీరవాణి వారసులు అదరగొట్టేసారు. రాజమౌళి అండ్ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. వివిధ శాఖల్లో వీరు ప్రతిభ చాటుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళలో ఈ ఇద్దరు కూడా యాడ్ అయ్యారు. మరి ఈ లాంచ్ ను ఉపయోగించుకుని ఎంత దూరం వెళతారో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ERHncD
Comments
Post a Comment