పవన్ తో సేఫ్ గేమ్ ఆడుతోన్న హారిక & హాసిని

పవన్ తో సేఫ్ గేమ్ ఆడుతోన్న హారిక & హాసిని
పవన్ తో సేఫ్ గేమ్ ఆడుతోన్న హారిక & హాసిని

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ పవన్ కు సన్నిహితంగా ఉన్నవాళ్లకు చూచాయిగా విషయాన్ని చెప్పేసారు. పవన్ కోసం ఇప్పటికే రెండు కథలు తయారవుతున్నాయి. అందులో ఒక కథ రీమేక్. ఈ రీమేక్ ను కొన్నది దిల్ రాజు. పవన్ రీ ఎంట్రీలో దిల్ రాజు పాత్ర చాలా ముఖ్యమైంది. పవన్ కు అసలు కష్టమనేది తెలీకుండా చూసుకుంటా అంటూ పింక్ రీమేక్ ను తెరపైకి తెచ్చాడు. పవన్ నుండి కేవలం 25 రోజుల కాల్ షీట్స్ ఫుల్ పేమెంట్ ఆఫర్ చేసి పవన్ ను టెంప్ట్ చేసాడు. ఫైట్లు, డ్యాన్సులు లేకుండా నటనతో పనైపోయేలా ఉండే స్క్రిప్ట్ ను పట్టి పవన్ ముందు పెట్టేసరికి రీ ఎంట్రీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న పవన్ ఇక ఎస్ అనకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే దిల్ రాజు ఈ సినిమా కోసం పవన్ వి బల్క్ డేట్స్ కూడా అడగలేదు. 25 రోజుల కాల్ షీట్స్ ను రెండు, మూడు సార్లు ఇచ్చినా పర్లేదని అన్నాడు. దీంతో పవన్ నో అనడానికి కూడా లేకుండా పోయింది. ఇక దిగడమంటూ మొదలెడితే మనవాళ్ళు ఊరుకుంటారేంటి, అందుకే వెంటనే క్రిష్ కర్చీఫ్ వేసాడు.

పవన్ కు అద్భుతమైన లైన్ చెప్పి పడేసాడు. కాకపోతే ఇది జానపద నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా. గుర్రాలు, కత్తి ఫైట్లు అన్నీ ఉంటాయి. 100 ఏళ్ల క్రితం నాటి కథ. ఇది అసలు పవన్ ఇప్పటివరకూ టచ్ చేయని జోనర్. పవన్ ను దృష్టిలో పెట్టుకుని కథ వినాలన్నా కూడా వింతగా ఉంది. ఇలాంటి జోనర్ లో సినిమా చేయడానికి చూచాయిగా ఎస్ అన్నాడు పవన్. వెంటనే క్రిష్ ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. వీటిలో ముందుగా పింక్ రీమేక్ తెరకెక్కుతుందని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఉన్నా కూడా హారిక & హాసిని బ్యానర్ కూడా నిర్మాణంలో భాగం తీసుకుంటోంది. ఈ మధ్య ఇది టాలీవుడ్ లో ట్రెండ్ లా మారింది. ఒకరు నిర్మాణ బాధ్యతలను చూసుకోవడం, మరొకరు స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండడం. మహేష్ బాబు చేస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో దిల్ రాజు ఇలాగే స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుండగా నిర్మాణ బాధ్యతలన్నీ అనిల్ సుంకర చూసుకుంటున్నాడు. ఇక్కడ పింక్ రీమేక్ విషయానికొచ్చేసరికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలన్నీ చూసుకుంటాడు. హారిక & హాసిని చినబాబు స్లీపింగ్ పార్ట్నర్ గా ఉంటాడు. లాభాలేమైనా వస్తే అందులో వాటా తీసుకుంటాడు.

అజ్ఞాతవాసి సమయంలో పవన్ సమయానికి రాక, అడిగిన కాల్ షీట్స్ ఇవ్వక, ఇచ్చిన కాల్ షీట్స్ వేస్ట్ అయిపోయి చినబాబు చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే పవన్ తో రిలేషన్ ను పాడు చేసుకోవడం ఇష్టం లేని చినబాబు డైరెక్ట్ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా స్లీపింగ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి హారిక & హాసిని బ్యానర్ కూడా టాలీవుడ్ లో ముదిరింది. ప్రస్తుతం ఈ చిత్రానికి దిల్ రాజు దర్శకుడ్ని వెతికే పనిలో ఉన్నాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qO9GVj

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly