మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రివ్యూ

మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రివ్యూ
మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రివ్యూ

ఒక్కో సినిమాతో విజయం సాధించి అనతికాలంలోనే మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న హీరో విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి తీసిన చిత్రం మీకు మాత్రమే చెప్తా. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు షామీర్ డైరెక్ట్ చేసాడు. పెళ్లి చూపులు చిత్రంతో విజయ్ దేవరకొండకు తొలి సూపర్ హిట్ ను అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇంకా అనసూయ, ఈ నగరానికి ఏమైంది చిత్రంలో తన కామెడీతో అలరించిన అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో ఈ చిత్రంలో కనిపిస్తారు. చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఈరోజు విడుదలయ్యే చిత్రాల్లో మీకు మాత్రమే చెప్తాకు మంచి బజ్ ఉంది. ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ కూడా ఈ చిత్రమే అవ్వనుంది. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడట విజయ్ దేవరకొండ. తాను ఇప్పటిదాకా సంపాదించిన మొత్తంలో 70 శాతం ఈ చిత్రానికి పెట్టాడట. అయితే చిత్ర ఫేట్ తో విజయ్ కు టెన్షన్ లేదు. ఎందుకంటే మంచి ధరలకే చిత్రాన్ని అమ్మడంతో టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది.

యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తాకు వాళ్ళే టార్గెట్ ఆడియన్స్. ఈ విషయం ప్రోమోలు, ట్రైలర్ చూస్తే క్లియర్ గా అర్ధమైపోతుంది. తనకు చెడు అలవాట్లేమీ లేవని హీరోయిన్ ను నమ్మించి పెళ్ళికి సిద్ధపడిన హీరోకు సంబంధించిన ఒక ఫసక్ వీడియో నెట్ లో లీక్ అవ్వడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వారి పెళ్లి విషయం ఏమైంది అన్న సింపుల్ కథకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను జోడించి మీకు మాత్రమే చెప్తాగా తెరకెక్కించారు. ఈరోజుల్లో రొమాన్స్ వీడియోలు తమ సెల్ ఫోన్స్ లో తీసుకోవడం యూత్ కు సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో వారు ఇలాంటి కథలకు బాగా అట్ట్రాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. టార్గెట్ ఆడియన్స్ ను మెప్పించే అంశాలున్న ఈ చిత్రం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందేమో చూద్దాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JC9rmS

Comments

Popular posts from this blog

Telangana govt declares September 25 holiday for offices, schools, colleges amid Ganapati immersion