పవన్ ఫ్యాన్స్ ని నిరాశపరిచిన బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ తో నేను సినిమా చేయడం లేదు , మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెబుతాను అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసిపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నిరాశకు గురిచేశాడు . పవన్ కళ్యాణ్ కు భక్తుడు బండ్ల గణేష్ దాంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని అనుకుంటున్న సమయంలో ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు బండ్ల గణేష్ .

రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే . రాజకీయాల్లో ఘోర ఓటమి చవిచూసాడు కాబట్టి ఇక సినిమాలపై దృష్టి పెడతాడని అంతా అనుకుంటున్న సమయంలో బండ్ల గణేష్ ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ చేసే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి . అయితే ఇవి పవన్ చెవిన పడ్డాయేమో ! కోప్పడ్డాడేమో !! అందుకే బండ్ల గణేష్ ఖండన ఇచ్చాడు . రాజకీయాల్లో దెబ్బతిని ఉన్నాడు కాబట్టి కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత సినిమాలపై దృష్టి పెట్టడం ఖాయం .



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2wrWcOH

Comments

Popular posts from this blog

Hyd rain: Getting rid of flood water proves costly