పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పూజా హెగ్డే తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియో లో మహర్షి చిత్రం షూటింగ్ జరుగుతోంది . పూజా హెగ్డే – మహేష్ బాబు లపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు . దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తికావడంతో పాటలను కూడా పూర్తిచేసే పనిలో పడ్డారు చిత్ర బృందం . ఈ పాట అనంతరం మరో పాట కోసం విదేశాలకు వెళ్లనున్నారు మహేష్ – పూజా హెగ్డే లు .
సందేశాత్మక కథతో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . ఇక ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .
English Title : Mahesh babu in romance mode
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FE3yTq
Comments
Post a Comment