‘అల్లు అర్జున్’, ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో చిత్రం జనవరి లో ప్రారంభం:
హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాలలోను, అటు ప్రేక్షక వర్గాలలోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే మరో ప్రకటనలో అధికారికంగా మీడియా వారికి తెలియజేయటం జరుగుతుంది. 2019 జనవరిలో చిత్రం ప్రారంభ మవుతుందని, అందరికీ 2019 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు).
English Title: Allu Arjun – Trivikram Srinivas film Announcement
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GXOUKu
Comments
Post a Comment