సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ సెకండ్ లుక్ విడుదల

ఈ చిత్ర షూటింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ పూర్తయింది. జనవరి రెండో వారం నుంచి మార్చి వరకు జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్, హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోంది.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Ro0vqf
Subscribe to my channel
Comments
Post a Comment